Soccer player pele: ఎంత మంది పిల్లలో నాకే తెలియదు.. సంచలన నిజాలు వెల్లడించిన సాకర్ దిగ్గజం..

Soccer player pele: క్రీడాకారులకు ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంటుందనేది అందరికీ తెలిసిందే.

Soccer player pele: ఎంత మంది పిల్లలో నాకే తెలియదు.. సంచలన నిజాలు వెల్లడించిన సాకర్ దిగ్గజం..

Updated on: Feb 24, 2021 | 10:18 PM

Soccer player pele: క్రీడాకారులకు ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంటుందనేది అందరికీ తెలిసిందే. ముఖ్యంగా క్రికెట్, సాకర్ ప్లేయర్లకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారు ఎక్కడికి వెళ్లినా.. అభిమానులు వారి ముందు వాలిపోతుంటారు. ఇకపోతే క్రీడాకారుల అఫైర్లకు కూడా లెక్క ఉండదనే విషయం మనం చెప్పుకోవాల్సిందే. నిత్యం చూస్తూనే ఉంటాం. ఆ క్రీడాకారుడు ఆమెతో డేటింగ్‌లో ఉన్నాడని, మరికొద్దిరోజులకే వేరొకరితో ఉన్నారని ఇలా ఎన్నో వార్తలు చూస్తుంటాం. అయితే, తాజాగా తన అఫైర్లకు సంబంధించి బ్రెజిల్ సాకర్ దిగ్గజం పీలే సంచలన విషయాలు వెల్లడించాడు.

తన వ్యక్తిగత వివరాలు బయటపెట్టాడు. అధికారికంగా ముగ్గురిని వివాహం చేసుకున్నా.. అనాధికారికంగా ఎంతో మందితో వివాహేతర సంబంధాలను కొనసాగించానని ప్రకటించాడు. అంతేకాదు.. తనకు ఎంత మంది మంది సంతానమో కూడా తెలియదని వ్యాఖ్యానించాడు. 80 ఏళ్ల పీలే.. తనపై తీసిన డాక్యూమెంటరీలో ఈ విషయాలన్నీ వెల్లడించారు. అయితే, తనకు, తన భార్యల ద్వారా ఏడుగురు సంతానం ఉన్నారని మాత్రం క్లారిటీ ఇచ్చాడు పీలే. అలాగే తన సంబంధాల గురించి ఎవరి వద్దా దాచలేదని, తనతో రిలేషన్‌లో ఉన్న అందరికీ క్లియర్‌గా చెప్పానని పేర్కొన్నాడు.

Also read:

బెంగాల్‌లో పోల్ టెన్షన్.. ఎర్ర సామ్రాజ్యానికి దీదీ చెక్.. తాజాగా పెరిగిన బీజేపీ దూకుడు

సంచలన తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు.. హిందూ మహిళ తన ఆస్తిని పుట్టింటి సభ్యులకు ఇవ్వోచ్చు..