ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న మహిళల బిగ్‌బాష్ టోర్నమెంట్లో టీమిండియా బ్యాటర్ స్మృతి మంధాన సెంచరీతో కదం తొక్కింది. దీంతో ఈ టోర్నీలో శతకం సాధించిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా అరుదైన రికార్డును ఖాతాలో వేసుకుంది. ఈ లీగ్‌లో సిడ్నీ థండర్స్ తరపున బరిలోకి దిగిన స్మృతి బుధవారం సెంచరీతో చెలరేగింది. క్వీన్స్‌లాండ్‌లోని హరప్ పార్క్ మైదానంలో మెల్‌బోర్న్ రెనెగేడ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 64 బంతుల్లో 114 పరుగులు సాధించింది. ఇందులో 14 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. అయితే స్మృతి సూపర్ సెంచరీతో చెలరేగినప్పటికీ సిడ్నీ థండర్స్ 4 పరుగుల స్వల్పతేడాతో ఓటమి చవిచూసింది. అయితే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా స్మృతినే ఎంపికైంది.
హర్మన్ ఆల్‌రౌండ్ ప్రతిభ..
కాగా ఇదే మ్యాచ్‌లో మరో టీమిండియా క్రికెటర్ హర్మన్ ప్రీత్ కౌర్ ఆల్‌రౌండ్ ప్రతిభతో తన జట్టును విజయతీరాలకు చేర్చింది. మొదట బ్యాటింగ్ చేసిన మెల్‌బోర్న్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. హర్మన్ కేవలం 55 బంతుల్లో 81 పరుగులు సాధించడం విశేషం. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సిడ్నీ థండర్స్ ఆదిలో నెమ్మదిగా ఆడడంతో పాటు వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. అయితే స్మృతి రాకతో స్కోరు బోర్డు ముందుకు పరుగెత్తింది. అద్భుతమైన ఆటతీరుతో తన జట్టును విజయ తీరాలకు చేర్చింది. అయితే సిడ్నీ విజయానికి చివరి ఓవర్‌లో 13 పరుగులు అవసరం కాగా.. హర్మన్ కేవలం 8 పరుగులే ఇచ్చింది. దీంతో స్మృతి జట్టు 4 పరుగుల తేడాతో ఓటమిపాలైంది..
A beautiful innings!
Congratulations, @mandhana_smriti ? #WBBL07 pic.twitter.com/Jwo4E1fN3X
— Weber Women’s Big Bash League (@WBBL) November 17, 2021
Phoebe Litchfield gave it everything on the rope but it’s another six for Harmanpreet Kaur!
Watch LIVE: https://t.co/e5UVmQR3sL #WBBL07 pic.twitter.com/X3lZJjjf8t
— Weber Women’s Big Bash League (@WBBL) November 17, 2021
IND vs NZ: ఇండియన్ ఓపెనర్ల తడాఖా.. ఖాతాలోకి సరికొత్త రికార్డ్.. ఏంటంటే..?