ఫైనల్‌ ఫోబియా… రజతంతో సరిపెట్టుకున్న సింధు

| Edited By:

Jul 21, 2019 | 3:51 PM

భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధుకు నిరాశే ఎదురైంది. తనను ఎప్పుడూ వేధించే ఫైనల్‌ ఫోబియాతోనే మరోసారి టైటిల్‌ అందుకోలేకపో​యింది. ప్రతిష్టాత్మక ఇండోనేసియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–1000 టోర్నమెంట్‌లో సింధు ఫైనల్లో ఓడి రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్‌ అకానె యామగుచి(జపాన్‌) 51 నిమిషాల్లో 21-15, 21-16 ప్రపంచ ఐదో ర్యాంకర్‌ సింధుపై అలవోక విజయం సాధించింది. ప్రారంభంలో సింధు ఆధిపత్యం కనబర్చినప్పటికీ.. తేరుకున్న యామగుచి ఏ […]

ఫైనల్‌ ఫోబియా... రజతంతో సరిపెట్టుకున్న సింధు
Follow us on

భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధుకు నిరాశే ఎదురైంది. తనను ఎప్పుడూ వేధించే ఫైనల్‌ ఫోబియాతోనే మరోసారి టైటిల్‌ అందుకోలేకపో​యింది. ప్రతిష్టాత్మక ఇండోనేసియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–1000 టోర్నమెంట్‌లో సింధు ఫైనల్లో ఓడి రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్‌ అకానె యామగుచి(జపాన్‌) 51 నిమిషాల్లో 21-15, 21-16 ప్రపంచ ఐదో ర్యాంకర్‌ సింధుపై అలవోక విజయం సాధించింది. ప్రారంభంలో సింధు ఆధిపత్యం కనబర్చినప్పటికీ.. తేరుకున్న యామగుచి ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. వరుస పాయింట్లు సాధించి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ఈ గెలుపుతో యమగూచి ,సింధుతో ఉన్న ముఖముఖి రికార్డును 5-10కి మెరుగు పరుచుకుంది.