పసిడి గెలిచిన పంచ్ వీరుడు శివ థాపా

| Edited By: Pardhasaradhi Peri

Jul 21, 2019 | 9:49 AM

 కజకిస్తాన్‌: భారత స్టార్ బాక్సర్ శివ థాపా (63 కేజీలు) చరిత్ర సృష్టించాడు. 13 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ బాక్సర్‌ శివ థాపా కజకిస్తాన్‌ ప్రెసిడెంట్స్‌ కప్‌ టోర్నీ చరిత్రలో భారత్‌కు తొలి స్వర్ణ పతకాన్ని అందించాడు. కజకిస్థాన్‌లోని ఆస్తానాలో శనివారం జరగాల్సిన ఫైనల్లో ప్రత్యర్థి జాకీర్ సఫిఉల్లిన్ (కజకిస్థాన్) గాయం కారణంగా వాకోవర్ ఇవ్వడంతో థాపా విజేతగా నిలిచాడు. ఆసియా క్రీడల్లో నాలుగు పతకాలు సాధించిన థాపా.. టోక్యో ఒలింపిక్స్‌లో తాను ఎప్పుడూ పాల్గొనే 60 […]

పసిడి గెలిచిన పంచ్ వీరుడు శివ థాపా
Follow us on

 కజకిస్తాన్‌: భారత స్టార్ బాక్సర్ శివ థాపా (63 కేజీలు) చరిత్ర సృష్టించాడు. 13 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ బాక్సర్‌ శివ థాపా కజకిస్తాన్‌ ప్రెసిడెంట్స్‌ కప్‌ టోర్నీ చరిత్రలో భారత్‌కు తొలి స్వర్ణ పతకాన్ని అందించాడు. కజకిస్థాన్‌లోని ఆస్తానాలో శనివారం జరగాల్సిన ఫైనల్లో ప్రత్యర్థి జాకీర్ సఫిఉల్లిన్ (కజకిస్థాన్) గాయం కారణంగా వాకోవర్ ఇవ్వడంతో థాపా విజేతగా నిలిచాడు.

ఆసియా క్రీడల్లో నాలుగు పతకాలు సాధించిన థాపా.. టోక్యో ఒలింపిక్స్‌లో తాను ఎప్పుడూ పాల్గొనే 60 కేజీల విభాగం లేకపోవడంతో బరువు పెరిగి 63 కేజీల కేటగిరీ బరిలో దిగాడు. కొత్త కేటగిరీకి త్వరగానే అలవాటు పడ్డా. కాస్త ఇబ్బంది ఎదురైనా.. అదేమంత కష్టం కాలేదు. ఎక్కువ వెయిట్ బాక్సర్లతో తలపడటం సవాలుతో కూడుకున్నదే అయినా అసాధ్యమేమీ కాదుఅని థాపా అన్నాడు. మహిళల 60 కేజీల విభాగంలో పర్వీన్ రజతం సాధించింది. ఆమె ఫైనల్లో రిమ్మా వొలొసెన్కో (కజకిస్థాన్) చేతిలో ఓడింది.