Novak Djokovic: నొవాక్ జొకోవిచ్‌పై భారీ కుట్ర.. షాకింగ్ విషయాలు వెల్లడించిన సెర్బియన్ మోడల్ నటాలియా..

|

Mar 24, 2021 | 5:16 AM

Novak Djokovic: ప్రపంచ నెంబర్ వన్ టెన్నీస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ ఇటీవలె అరుదైన ఘనత సాధించిన విషయం తెలిసిందే. టెన్నీస్ వరల్డ్

Novak Djokovic: నొవాక్ జొకోవిచ్‌పై భారీ కుట్ర.. షాకింగ్ విషయాలు వెల్లడించిన సెర్బియన్ మోడల్ నటాలియా..
Novak Djokovic
Follow us on

Novak Djokovic: ప్రపంచ నెంబర్ వన్ టెన్నీస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ ఇటీవలె అరుదైన ఘనత సాధించిన విషయం తెలిసిందే. టెన్నీస్ వరల్డ్ చాంపియన్‌గా వరుసగా 311 వారాలు పాటు కొనసాగి స్వి్ట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెదదర్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. స్విస్ టెన్నిస్ స్టార్ కంటే ఒక వారం ఎక్కువగా చాంపియన్‌గా కొనసాగి చరిత్ర సృష్టించాడు. అయితే ఈ రికార్డ్ క్రియేటర్‌పై అనేక కుట్రలు జరిగాయట. అతని పరువు, ప్రతిష్టలను దెబ్బతీసేందుకు చాలా మంది ప్రయత్నించారట. అంతేకాదు.. ఇందుకోసం ఒక అమ్మాయిని వాడుకున్నారట. జొకోవిచ్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఒక అమ్మాయిని ఎరగా వేశారని తాజాగా వెలుగులోకి వచ్చింది. అయితే, సదరు అమ్మాయే ఈ విషయాన్ని వెల్లడించడం విశేషం ఇక్కడ. సెర్బియన్ స్టార్ ప్లేయర్ నోవాక్ జొకోవిచ్.. వరుస విజయాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

ఆ విజయాలతో పాటే అతని పేరు, ప్రఖ్యాతులు కూడా పెరుగుతున్నాయి. అతని ఎదుగుదలపై అసూయ పెంచుకున్న కొందరు వ్యక్తులు జొకొవిచ్‌ను ఎలాగైనా దెబ్బ తీయాలని ఫిక్స్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే సెర్బియాకు చెందిన ఓ మోడల్‌ను జొకోపై పురిగొల్పే ప్రయత్నం చేశారు. సెర్బియాకు చెందిన మోడల్ నటాలియా సెకిచ్‌ను సంప్రదించిన కొందరు వ్యక్తులు.. జొకోను లొంగదీసుకుని, అతనితో ఏకాంతంగా ఉన్న దృశ్యాలను వీడియో తీసి ఇస్తే రూ. 52 లక్షలు ఇస్తామని ఆఫర్ చేశారు. అయితే, వారు ఇచ్చిన ఈ ఆఫర్‌ను నటాలియా రిజెక్ట్ చేసిందంట. జొకోవిచ్‌కు అంటే తనకు చాలా ఇష్టం అని, ఆయనకున్న ఇమేజ్‌ను దెబ్బతీయడం తనకు ఏమాత్రం ఇష్టం లేదని నటాలియా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఆ కారణంగానే వారు ఇచ్చిన ఆఫర్‌ను తిరస్కరించానంది.

Also read:

Government of India: మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. ఏప్రిల్ 30వ తేదీ వరకు అంతర్జాతీయ విమాన ప్రయాణాలు రద్దు.. ప్రకటించిన కేంద్ర ప్రభుతవం..

OU – JNTU Exams: ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్‌టీయూ పరీక్షలు యధాతథం.. నోటిపికేషన్ విడుదల..