Sania Mirza: ఆపరేషన్‌ సిందూర్‌పై స్పందించిన సానియా మీర్జా .. ఆ ఫొటోలు షేర్ చేస్తూ సంచలన పోస్ట్

భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ లో భాగంగా పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలు నేలమట్టమయ్యాయి. అలాగే 100 మంది ఉగ్రవాదలు కూడా హతమయ్యారు. దీనిపై సినీ, క్రీడా ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా ఆపరేషన్ సిందూర్ పై స్పందించింది.

Sania Mirza: ఆపరేషన్‌ సిందూర్‌పై స్పందించిన సానియా మీర్జా .. ఆ ఫొటోలు షేర్ చేస్తూ సంచలన పోస్ట్
Sania Mirza

Updated on: May 08, 2025 | 6:39 PM

పహల్గామ్‌లో ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ కు భారతదేశం దీటుగా సమాధానమిచ్చింది. ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత దళాలు పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ తో సహా పాకిస్తాన్ గడ్డపై అనేక నగరాల్లోని ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేశాయి. పీవోకేలోని ముజఫరాబాద్ మొదలు పాకిస్తాన్ లోపల ఉన్న బహవల్పూర్ వరకు ఉన్న ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. అలాగే 100 మందికి పైగా ఉగ్రవాదులను కూడా మట్టుబెట్టింది. భారత ప్రభుత్వం చేపట్టిన ఈ ఆపరేషన్ పై సినీ, ప్రముఖులు హర్షాతిరేకాలు వ్యక్తంచేస్తున్నారు. ఈ క్రమంలోనే భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా కూడా తన స్పందనను తెలియజేసింది. ఆపరేషన్‌కు సిందూర్ కు సంబంధించిన ప్రెస్‌మీట్‌లో ఇద్దరూ మహిళా సైనికాధికారులు పాల్గొన్న సంగతి తెలిసిందే. కల్నల్‌ సోఫియా ఖురేషీ, వింగ్‌ కమాండర్‌ వ్యోమికా సింగ్‌ ఈ ఆపరేషన్ గురించి బ్రీఫింగ్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట వైరలయ్యాయి. ఇప్పుడిదే ఫొటోలను ఇన్ స్టా స్టోరీస్ లో సానియా మీర్జా షేర్ చేసింది. ఈ శక్తివంతమైన ఫొటో.. మనమంతా ఒక్కటే జాతి అనేందుకు నిలువెత్తు నిదర్శనంలా నిలిచింది’ అని సానియా మీర్జా పేర్కొంది.

హల్గామ్ దాడిలో చాలా మంది మహిళలు తమ భర్తలను, తండ్రులను,స్నేహితులను తమ కళ్ల ముందే కోల్పోయారు. దీనిని దృష్టిలో ఉంచుకునే భారత ప్రభుత్వం తమ మహిళా శక్తిని చాటుకుంది. అందులో భాగంగానే ఆపరేషన్ సిందూర్ ప్రెస్ మీట్ కు ఆర్మీ కల్నల్ సోఫియా ఖురేషి, వైమానిక దళం వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ హాజరయ్యారు.

Sania Mirza Post

 

సానియా మీర్జాతో పాటు సచిన్ టెండూల్కర్ ఆపరేషన్ సిందూర్ పై స్పందించాడు. ‘ఏకత్వంలో నిర్భీతి. ఎల్లలెరుగని బలం. మన ప్రజలే మన దేశానికి బలం. మనమంతా ఒక్కటే. ప్రపంచంలో తీవ్రవాదానికి చోటు లేదు. జైహింద్‌’ అని ట్వీట్ చేశాడు. అలాగే వీరేంద్ర సెహ్వాగ్, విజేందర్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్,  శిఖర్ ధావన్ తదితర క్రీడా ప్రముఖులు ఆపరేషన్ సిందూర్ పై స్పందించారు. ‘జైహింద్’ అంటూ భారత ప్రభుత్వానికి తమ మద్దతు తెలిపారు.

సచిన్ ట్వీట్.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..