2014లో సన్‌రైజర్స్ జట్టు సారధ్య బాధ్యతలు చేపట్టి.. 2016లో ట్రోఫీని కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర వహించిన డేవిడ్ వార్నర్.. వచ్చే ఏడాది ఐపీఎల్‌కు రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడనున్నాడని అనుకుంటున్నారా.? మీరు అలా అనుకుంటే పొరపాటే.. ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా, శ్రీలంక రెండో టీ20ను దృష్టిలో పెట్టుకుని రాయల్స్, సన్‌రైజర్స్ ఫ్రాంచైజీలు ట్విట్టర్ వేదికగా ఓ ఫన్నీ సంభాషణను ఫ్యాన్స్‌తో పంచుకున్నారు.
‘స్మిత్, వార్నర్‌లు కలిసి బ్యాటింగ్ చేస్తే.. చూడటంలో ఆ కిక్కే వేరు’ అని సన్‌రైజర్స్ పేర్కోగా.. అందుకు బదులు ఇస్తూ రాయల్స్ ‘మీ స్టార్ ఓపెనర్‌ను మాకు ఇచ్చేస్తారా.? అని ప్రశ్నించింది.
అయితే సన్‌రైజర్స్.. వార్నర్‌ను వదులుకోవడం జరగని పని. ఒకవేళ వదులుకుంటే మాత్రం రాయల్స్‌కు ఓపెనింగ్ జోడి అద్భుతంగా సెట్ అవుతుంది. ఒక పక్క విధ్వంసకరమైన జోస్ బట్లర్.. మరో పక్క వార్నర్.. ఇంకేముంది మిగతా జట్లు ఈ ద్వయాన్ని తట్టుకోవడం కష్టమేనని చెప్పాలి.
మరోవైపు స్టీవ్ స్మిత్ గురించి మాట్లాడుకుంటే.. 2014లో రాయల్స్ అతన్ని తీసుకోగా.. 2016,17ల్లో రైజింగ్ పూణే సూపర్ జాయింట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన స్మిత్.. ఫైనల్ వరకు జట్టును చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు.
2018లో ఇద్దరూ కూడా బ్యాన్ కారణంగా జట్లకు దూరమైనా.. 2019కి అద్భుతమైన పునరాగమనం ఇచ్చారు. ప్రస్తుతం వచ్చే సీజన్‌కు కెన్ విలియమ్సన్ సన్‌రైజర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. రాజస్థాన్ రాయల్స్ జట్టు పగ్గాలను స్టీవ్ స్మిత్ తిరిగి దక్కించుకున్నాడు. అటు సన్‌రైజర్స్‌కు బెయిలీస్ కొత్త కోచ్ కాగా.. రాయల్స్‌కు ఆండ్రూ మెక్‌డోనాల్డ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టారు.
.@stevesmith49: Tell Dave, I need to bat today! ? https://t.co/n3A6OWZALw
— Rajasthan Royals (@rajasthanroyals) October 30, 2019
What better than both of them batting together ?
— SunRisers Hyderabad (@SunRisers) October 30, 2019
Releasing him, @SunRisers? ?
— Rajasthan Royals (@rajasthanroyals) October 30, 2019