RCB: ఆర్సీబీ డ్రెసింగ్ రూంలో వీడియో.. కోహ్లీ ఏం చెప్పాడంటే..

|

Sep 27, 2021 | 7:20 PM

ఆదివారం జరిగిన మ్యాచ్‎లో ముంబైపై 54 పరుగుల తేడా విజయం సాధించటంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు ఆనందం వ్యక్తం చేశారు...

RCB: ఆర్సీబీ డ్రెసింగ్ రూంలో వీడియో.. కోహ్లీ ఏం చెప్పాడంటే..
Kohli123
Follow us on

ఆదివారం జరిగిన మ్యాచ్‎లో ముంబైపై 54 పరుగుల తేడా విజయం సాధించటంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు ఆనందం వ్యక్తం చేశారు. జట్టు సభ్యులు డ్రెసింగ్ రూంలో సంబురాలు చేసుకున్నారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‎గా మారింది. డివిలియర్స్ కోహ్లీని అనుకరిస్తూ చేసిన యాక్టింగ్ అందరిని ఆకర్షించింది. అనంతరం జట్టు సభ్యుల ఆటపై కెప్టెన్ కోహ్లీ మాట్లాడారు. గ్లెన్ మాక్స్‎‎వెల్ బాగా ఆడారని.. హర్షల్ పటేల్ హ్యాట్రిక్‎తో అదరగొట్టారని చెప్పాడు. చాహల్, మాక్స్‎‎వెల్ క్రమం తప్పకుండా వికెట్లు తీశారన్నారు. ఈ విజయంతో బెంగళూరు గాడిలో పడిందని… మొత్తం 10 మ్యాచ్‎ల్లో ఆరింటిలో విజయం సాధించి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉందన్నారు. ఆర్సీబీ ఫ్లే ఆఫ్‎కు వెళ్లాలంటే మరో రెండు మ్యాచ్‎ల్లో విజయం సాధించాల్సి ఉంటుందని కోహ్లీ చెప్పాడు.

ముంబైపై విజయం సాధించడానికి భరత్, మాక్స్‎‎వెల్ బ్యాటింగే కారణమని చెప్పుకొచ్చారు. భరత్ బ్యాటింగ్ చేసిన విధానం నచ్చిందన్నారు. మ్యాక్సీ చాలా చక్కగా బౌలర్లను ఎదుర్కొని బౌండరీలు కొట్టారని చెప్పారు. మేం మైదానంలో చేయాలనుకున్నది చేశామని చెప్పారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బుధవారం రాజస్తాన్ రాయల్స్‎తో తలపడనుంది. ఐపీఎల్ రెండో దశలో మూడు మ్యాచులు ఆడిన బెంగళూరు రెండింటిలో ఓడిపోయి.. ఒక మ్యాచ్‎లో గెలిచింది. ఈ మూడు మ్యాచుల్లో ఏబీ డివిలియర్స్‎ అంతగా రాణించలేదు. అతడి ఆటపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

 

Read also: AB de Villiers: తండ్రి ఔటవడంతో కుర్చీని తన్నేసిన డివిలియర్స్ కొడుకు.. వైరల్‎గా మారిన వీడియో..