Khel Ratna Award: రాజీవ్ ఖేల్‌ర‌త్న పేరు మార్పు.. ఇకపై మేజ‌ర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌ర‌త్న అవార్డు

ప్రధాని న‌రేంద్ర మోడి మరో కీల‌క నిర్ణయం తీసుకున్నారు. క్రీడ‌ల్లో ప్రతిభ కనబర్చిన వారికి అందించే అత్యున్నత పుర‌స్కారం రాజీవ్ ఖేల్‌ర‌త్న పేరును మారుస్తున్నట్లు ప్రకటించారు.

Khel Ratna Award: రాజీవ్ ఖేల్‌ర‌త్న పేరు మార్పు.. ఇకపై మేజ‌ర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌ర‌త్న అవార్డు
Modi On Major Dhyan Chand Khel Ratna Award

Updated on: Aug 06, 2021 | 1:07 PM

Major Dhyan Chand Khel Ratna: ప్రధాని న‌రేంద్ర మోడి మరో కీల‌క నిర్ణయం తీసుకున్నారు. క్రీడ‌ల్లో ప్రతిభ కనబర్చిన వారికి అందించే అత్యున్నత పుర‌స్కారం రాజీవ్ ఖేల్‌ర‌త్న పేరును మారుస్తున్నట్లు ప్రకటించారు. ఇకపై ఈ పురస్కారాన్ని మేజ‌ర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌ర‌త్న( Major Dhyan Chand Khel Ratna ) అవార్డుగా మార్చారు. ఈ అవార్డు పేరును మార్చాల‌ని త‌న‌కు దేశ‌వ్యాప్తంగా పౌరుల నుంచి అనేక విన‌తులు వచ్చాయని, అందుకే పేరు మార్చాల్సి వచ్చిందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఈ మేరకు మోడీ ట్విట‌ర్‌లో వెల్లడించారు.

Major Dhyan Chand Khel Ratna Award

అభిమానుల వాళ్ల సెంటిమెంట్‌ను దృష్టిలో ఉంచుకొని ఇక నుంచి ఖేల్‌ర‌త్న అవార్డు పేరును మేజ‌ర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డుగా మారుస్తున్నట్లు ప్రక‌టించారు. హాకీ లెజెండ్ ధ్యాన్‌చంద్ జ‌యంతి అయిన ఆగ‌స్ట్ 29ని ఇప్పటికే జాతీయ క్రీడా దినోత్సవంగా జ‌రుపుకుంటున్న విష‌యం తెలిసిందే. తాజాగా ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ క్రీడా అత్యున్నత పుర‌స్కారం కూడా ధ్యాన్‌చంద్ పేరుతోనే ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Read Also…  జార్ఖండ్‌ జడ్జి హత్య కేసుపై సుప్రీంకోర్టు సీరియస్.. సీబీఐకి నోటీసులు జారీ చేసిన చీఫ్ జస్టిస్ రమణ