Rahul Dravid Response: ఆస్ట్రేలియాపై చిరస్మరణీయ విజయం అందుకోవడంలో యువ ఆటగాళ్లదే కీలక పాత్ర. చివరి రెండు టెస్టుల్లో మహమ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, శుభ్‌మాన్ గిల్, రిషబ్ పంత్ అత్యుత్తమ ప్రదర్శనలకు మాజీల నుంచి ప్రేక్షకుల వరకు అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక వారిని సానపట్టిన కోచ్ రాహుల్ ద్రావిడ్‌పై కూడా పొగడ్తల వర్షం కురుస్తోంది. ఈ సందర్భంగా ద్రావిడ్ స్పందిస్తూ..
”నాకు అందరూ అనవసరంగా క్రెడిట్ ఇస్తున్నారు. ప్రశంసలు అన్నీ చెందాల్సింది కుర్రాళ్లకు’ అంటూ ద్రావిడ్ హుందాగా జవాబిచ్చాడు. అటు ఈ ఆటగాళ్లు ఎ-లెవెల్‌లో ఉన్నప్పుడు ద్రావిడ్ ఇచ్చిన సలహాలు, సూచనలు ఎంతగానో ఉపయోగాపడ్డాయని మాజీ సెలెక్టర్ జతిన్ పరాంజపై అభిప్రాయపడ్డాడు. అలాగే యువ క్రికెటర్లు కూడా తమకు రాహుల్ ద్రావిడ్ ఇచ్చిన కోచింగ్ ఎంతగానో ఉపయోగపడిందని చెప్పిన సందర్భాలు లేకపోలేదు.