జోరు మీదున్న జో రూట్.. వరుస సెంచరీలతో అదరగొడుతున్న ఇంగ్లాండ్ కెప్టెన్.. భారత్‌తో సిరీస్‌లో అతడే కీలకం..
Joe Root Form: భారత్‌తో టెస్టు సిరీస్‌కు ముందు ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ జోరు మీదున్నాడు. వరుస సెంచరీలతో అదరగొడుతున్నాడు. తన...
Joe Root Form: భారత్‌తో టెస్టు సిరీస్‌కు ముందు ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ జోరు మీదున్నాడు. వరుస సెంచరీలతో అదరగొడుతున్నాడు. తన అద్భుతమైన ఫాంను కొనసాగిస్తున్న రూట్.. శ్రీలంకతో రెండో టెస్టులో 186 పరుగులు చేశాడు. అటు తొలి టెస్టులో కూడా డబుల్ సెంచరీతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. దీనితో అతడు ఇంగ్లాండ్ తరపున టెస్టులలో అత్యధిక పరుగులు చేసిన ఐదో బ్యాట్స్‌మెన్‌గా ఘనత సాధించాడు. ఈ జాబితా ఇంగ్లాండ్ మాజీ ఓపెనర్ అలిస్టర్ కుక్ 12,472 పరుగులతో అగ్రస్థానంలో నిలిచాడు.
ఇప్పటిదాకా 98 టెస్టులు ఆడిన జో రూట్.. 48.51 సగటుతో 8,052 పరుగులు చేశాడు. భారత్ సిరీస్‌కు ముందు జో రూట్ ఫాంలో ఉండటం ఇంగ్లాండ్‌కు కలిసొచ్చే అంశం. ఖచ్చితంగా టెస్టుల్లో రూట్ కీలకం కానున్నాడు. అటు బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్ కూడా స్వదేశంలో ఆడిన అనుభవం ఉండటంతో భారత్-ఇంగ్లాండ్ సిరీస్ ఆసక్తికరంగా సాగనుంది.