భారత స్టార్ షట్లర్, ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ పివీ సింధు.. ప్రధాని మోదీని కలిశారు. బ్యాడ్మింటన్ ఛాంపియన్‌గా తన ఆనందాన్ని మోదీతో పంచుకున్నారు. తరువాత కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజుతోనూ ఆమె సమావేశం అయ్యారు. ఛాంపియన్‌గా గెలిచిన తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చిన ఆమెకు ఢిల్లీ ఎయిర్ పోర్టులో క్రీడాభిమానులు పూలమాలలతో కోలాహలంగా ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా.. తాను భారతీయురాలిగా గర్విస్తున్నానని ఆమె చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నానని ఆమె తెలిపారు.
World champion @Pvsindhu1 touchdown in ??.
Hear her speak for the first time after arriving in New Dehi.?@Media_SAI @IndiaSports @WeAreTeamIndia #IndiaontheRise #BEFWorldchampion pic.twitter.com/5J4jY6MFCa
— BAI Media (@BAI_Media) August 26, 2019