జస్ట్ మిస్..ఒక్క పాయింట్ తేడాతో ఓడిన తెలుగు టైటాన్స్!

ప్రొకబడ్డీ 2019 లీగ్‌లో  తెలుగు టైటాన్స్‌కు  మరో ఎదురుదెబ్బ తగిలింది. బుధవారం రాత్రి దబాంగ్ ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఒక్క పాయింట్ తేడాతో ఓటమిని చవిచూసింది. విజయం కోసం ఇరు జట్లు హోరాహోరీగా పోరాడిన ఈ మ్యాచ్‌లో 33-34 తేడాతో టైటాన్స్ ఓడింది.  మ్యాచ్ ఆరంభం నుంచి ఇరు జట్లు పాయింట్ల కోసం హోరాహోరీగా తలపడ్డాయి. ఓ దశలో 20-17 తేడాతో ఆధిక్యంలో ఉన్న తెలుగు టైటాన్స్ జట్టు.. తర్వాత నెమ్మదించింది. చివరి వరకు ఆధిక్యం చేతులు […]

జస్ట్ మిస్..ఒక్క పాయింట్ తేడాతో ఓడిన తెలుగు టైటాన్స్!

Updated on: Jul 25, 2019 | 2:25 AM

ప్రొకబడ్డీ 2019 లీగ్‌లో  తెలుగు టైటాన్స్‌కు  మరో ఎదురుదెబ్బ తగిలింది. బుధవారం రాత్రి దబాంగ్ ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఒక్క పాయింట్ తేడాతో ఓటమిని చవిచూసింది. విజయం కోసం ఇరు జట్లు హోరాహోరీగా పోరాడిన ఈ మ్యాచ్‌లో 33-34 తేడాతో టైటాన్స్ ఓడింది.  మ్యాచ్ ఆరంభం నుంచి ఇరు జట్లు పాయింట్ల కోసం హోరాహోరీగా తలపడ్డాయి. ఓ దశలో 20-17 తేడాతో ఆధిక్యంలో ఉన్న తెలుగు టైటాన్స్ జట్టు.. తర్వాత నెమ్మదించింది. చివరి వరకు ఆధిక్యం చేతులు మారినా.. ఢిల్లీనే విజయం వరించింది. దీంతో లీగ్‌లో ఇప్పటి వరకూ ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ టైటాన్స్‌ ఓడిపోయింది.