PM Modi – Neeraj Chopra: పారిస్ ఒలింపిక్స్‌లో నీరజ్‌కు రజతం.. ప్రధాని మోదీ అభినందనలు..

|

Aug 09, 2024 | 8:32 AM

జావెలిన్‌ త్రో ఫైనల్లో.. 89.45 మీటర్లు విసిరి రెండో స్ధానంలో నిలిచాడు చోప్రా. తొలి స్థానంలో 92.97 మీటర్లు విసిరిన పాక్‌ అథ్లెట్‌ నదీమ్‌.. ఒలింపిక్‌ రికార్డుతో బంగారం సాధించాడు. ఓ భారతీయ అథ్లెట్ ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ ఈవెంట్‌లో..

PM Modi - Neeraj Chopra: పారిస్ ఒలింపిక్స్‌లో నీరజ్‌కు రజతం.. ప్రధాని మోదీ అభినందనలు..
Pm Modi & Neeraj Chopra
Follow us on

ఒలింపిక్స్‌లో నీరజ్‌ చోప్రా మరో చరిత్ర రాశాడు. టోక్యోలో బంగారు పతకాన్ని తీసుకొచ్చిన నీరజ్‌.. ఈసారి రజతాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అసలు భారత్‌లో ఊసే లేని జావెలిన్‌ త్రోలో పతకాన్ని తీసుకురావడమే గొప్ప అయితే.. నీరజ్‌ దాన్ని రెండు సార్లు సాధించడం.. అనన్య సామాన్యం. జావెలిన్‌ త్రో ఫైనల్లో.. 89.45 మీటర్లు విసిరి రెండో స్ధానంలో నిలిచాడు చోప్రా. తొలి స్థానంలో 92.97 మీటర్లు విసిరిన పాక్‌ అథ్లెట్‌ నదీమ్‌.. ఒలింపిక్‌ రికార్డుతో బంగారం సాధించాడు. ఓ భారతీయ అథ్లెట్ ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ ఈవెంట్‌లో వరుసగా రెండు పతకాలు సాధించడం ఇదే తొలిసారి.

నీరజ్‌ విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ Xలో స్పందించారు. అతడో అద్భుత ఆటగాడన్నారు మోదీ. మరోసారి తన సత్తాని చాటాడని.. ఆయన ఒలింపిక్‌ సక్సెస్‌తో భారతావని మురుస్తోందన్నారు ప్రధాని. ఎంతో మంది యువ అథ్లెట్లకు నీరజ్‌ ఆదర్శంగా నిలుస్తాడని ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. మరోవైపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా నీరజ్‌ను అభినందిస్తూ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

మరిన్ని ఒలింపిక్స్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..