PM Modi: మీ శ్రమ ఫలించింది.. సరబ్‌జోత్‌ సింగ్‌‌తో ప్రత్యేకంగా మాట్లాడిన ప్రధాని మోదీ.. వీడియో..

|

Jul 30, 2024 | 8:05 PM

పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారులు సత్తచాటుతున్నారు.. ఇప్పటికే వ్యక్తిగత ఈవెంట్‌లో మను భాకర్ కాంస్య పతకాన్ని సాధించి సంగతి తెలిసిందే.. కాగా.. తాజాగా మరో పతకాన్ని ఖాతాలో వేసుకుంది.. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ క్వాలిఫికేషన్‌లో భారత షూటర్స్‌ మను బాకర్‌- సరబ్‌జోత్‌ సింగ్‌ జోడీ 580 పాయింట్లతో మూడో స్థానాన్ని కైవసం చేసుకుని కాంస్యం దక్కించుకున్నారు.

PM Modi: మీ శ్రమ ఫలించింది.. సరబ్‌జోత్‌ సింగ్‌‌తో ప్రత్యేకంగా మాట్లాడిన ప్రధాని మోదీ.. వీడియో..
Pm Modi
Follow us on

పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారులు సత్తచాటుతున్నారు.. ఇప్పటికే వ్యక్తిగత ఈవెంట్‌లో మను భాకర్ కాంస్య పతకాన్ని సాధించి సంగతి తెలిసిందే.. కాగా.. తాజాగా మరో పతకాన్ని ఖాతాలో వేసుకుంది.. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ క్వాలిఫికేషన్‌లో భారత షూటర్స్‌ మను బాకర్‌- సరబ్‌జోత్‌ సింగ్‌ జోడీ 580 పాయింట్లతో మూడో స్థానాన్ని కైవసం చేసుకుని కాంస్యం దక్కించుకున్నారు. కాంస్య పతక పోరులో మను-సరబ్‌జోత్ 16-10తో కొరియా జోడీని ఓడించారు. దీంతో ఒలింపిక్స్ లో భారత్ పతకాల సంఖ్య 2కి పెరిగింది. అంతేకాకుండా.. ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయ అథ్లెట్‌గా మను భాకర్ నిలిచింది.

అయితే.. మొదటగా కాంస్య పతకాన్ని దక్కించుకున్న మను భాకర్ తో ప్రధాని మోదీ స్వయంగా ఫోన్‌లో మాట్లాడిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే మిక్స్‌డ్‌ టీమ్‌ క్వాలిఫికేషన్‌లో భారత షూటర్స్‌ మను బాకర్‌- సరబ్‌జోత్‌ సింగ్‌ జోడీ కాంస్యం దక్కించుకోవడంతో ప్రధాని మోదీ సరబ్‌జోత్‌ సింగ్‌ తో ప్రత్యేకంగా మాట్లాడారు.. ముందుగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత నేరుగా సరబ్‌జోత్‌తో ఫోన్‌లో మాట్లాడాడు. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.

వీడియో చూడండి..

‘‘అభినందనలు. మీరు దేశం పేరును ప్రకాశించేలా చేసారు.. మాన్ కూడా ప్రకాశించేలా చేసింది.. మీ శ్రమ ఫలించింది. మనుకి కూడా నా శుభాకాంక్షలు. మీ వ్యక్తిగత ఈవెంట్ బాగా జరగలేదు, కానీ మీరు ఈ టీమ్ ఈవెంట్‌లో బాగా ఆడారు..’’

పతక విజేత సరబ్‌జోత్ ప్రధానితో మాట్లాడుతూ.. ‘‘సార్, నేను ఈసారి పెద్దగా రాణించలేకపోయాను. పర్వాలేదు.. వచ్చే ఒలింపిక్స్‌లో వ్యక్తిగత ఈవెంట్లలో కూడా మెరుగ్గా ఆడతాను. ఇంతకంటే కష్టపడి ఆడతాను.’’ అంటూ బదులిచ్చాడు..

ఈ సందర్భంగా మను భాకర్ – సరబ్‌జోత్‌ల జోడిని ప్రధాని మోదీ ప్రశంసించారు. ఈ సందర్భంగా పలువిషయాలను అడగితెలుసుకున్నారు.. దీంతో పాటు మను ఎక్కడ ఉంది అంటూ ప్రత్యేకంగా అడగగా.. మను డోప్ టెస్ట్ కొనసాగుతోందని సరబ్ జోత్ తెలిపాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..