పరుగు పందెం అయినా వెయిట్ లిఫ్టింగ్ అయినా అసలు క్రీడా ఏదైనా సరే ఒలింపిక్స్, పారాలింపిక్స్‌లో పతకం గెలిస్తే తన కల సాకారం అయినట్లే అని ప్రతి క్రీడాకారుడు భావిస్తాడు. అదే విధంగా 23 ఏళ్ల ప్రీతీ పాల్ కూడా దేశానికి పతకం అందించాలని కల కన్నది. తన కలను సాకారం చేసుకుని కేవలం 48 గంటల్లోనే రెండుసార్లు పారిస్ పారాలింపిక్స్‌లో భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడానికి ఆమె కారణమైంది. ప్రీతీ పాల్ ఆగస్టు 30న 100 మీటర్ల రేసులో, సెప్టెంబరు 1వ తేదీన 200 మీటర్ల రేసులో కాంస్యం గెలుచుకుంది, దీనితో పారాలింపిక్ గేమ్స్ లో ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్‌లో భారతదేశం నుంచి 2 పతకాలు సాధించిన మొదటి మహిళగా నిలిచింది.
సెరిబ్రల్ పాల్సీ అనే బ్రేకర్‌ను ట్రిప్ చేయడం
పారిస్ పారాలింపిక్స్‌లో చరిత్ర సృష్టించిన ప్రీతీ పాల్ విజయగాథ చూస్తే ఆమె జర్నీ అంత సింపుల్ ఏమీ కాదు. ప్రీతి పాల్ యూపీలోని ముజఫర్‌నగర్ జిల్లా హషంపూర్ గ్రామ నివాసి. చిన్నప్పటి నుంచి సెరిబ్రల్ పాల్సీ అనే వ్యాధితో బాధపడుతోంది. ప్రీతి తండ్రి అనిల్ కుమార్ పాల్ పాల డెయిరీని నడుపుతున్నాడు. తన నలుగురు తోబుట్టువులలో ప్రీతి రెండవది.
కోచ్ దగ్గర శిక్షణ తీసుకుని అద్భుతాలు చేస్తున్న ప్రీతి
తండ్రి అనిల్ కుమార్ పాల్ తన కుమార్తె అనారోగ్యానికి మీరట్ నుంచి ఢిల్లీకి తీసుకుని వెళ్లి మరీ చికిత్స చేయించారు. అయినా పెద్దగా ప్రయోజనం కనిపించలేదు. దీంతో ప్రీతి జీవితంలో ఏదైనా సాధించాలని భావించింది. తనకు వచ్చిన దానినే శక్తిగా ఉపయోగించుకోవాలని నిర్ణయించుకుంది. ఈ నిర్ణయం తీసుకుని ప్రీతీ పాల్ జర్నీ మొదలు పెట్టింది. కోచ్ గజేంద్ర సింగ్ వద్ద శిక్షణ తీసుకుంటూ నెమ్మదిగా జీవితంలో పురోగతి నిచ్చెనలను అధిరోహించడం ప్రారంభించింది.
పారిస్ కంటే ముందు జపాన్‌లో పతకం సాధించిన ప్రీతి
పారిస్ పారాలింపిక్స్‌లో భారత జెండాను ఎగురవేయడానికి ముందు, ప్రీతి ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో కూడా తన పేరును లిఖించుకుంది. 2024లో జపాన్‌లో జరిగిన ఆ పోటీలో కాంస్య పతకాన్ని కూడా గెలుచుకుంది. ఇక, ఇప్పుడు పారిస్ పారాలింపిక్స్‌లో ఒకదాని తర్వాత ఒకటి రెండు పతకాలు సాధించడం ద్వారా త్రివర్ణ పతకాన్ని రెండు సార్లు ఎగురవేసే అవకాశం లభించింది.
పెళ్లిలో సమస్యలు వస్తాయన్న వారే ఇప్పుడు ప్రశంసిస్తున్నారు
యూపీకి చెందిన ఓ పాలు అమ్మే వ్యక్తి కూతురు ఇప్పుడు ఇండియాకే డార్లింగ్‌గా మారింది. తన కూతురు వికలాంగురాలు కనుక పెళ్లికి సమస్యలు వస్తాయని ప్రజలు తనతో చెప్పేవారని ప్రీతి తండ్రి అనిల్ కుమార్ పాల్ చెప్పారు. పారిస్ సక్సెస్ తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయి చాలా బాగా చేసిందని వారె తనకు చెబుతున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా భారతదేశ ప్రతిష్ట తన కూతురు మరింత పెంచేలా చేసింది అంటూ గర్వంగా చెబుతున్నారు అనిల్
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..