Paris Olympics: ఒలింపిక్స్‌లో పేలిన భారత్‌ తూటా.. పీవీ సింధు, నిఖ‌త్ జ‌రీన్ శుభారంభం.. ఫైనల్‌కు అర్హత సాధించిన అర్జున్..

|

Jul 29, 2024 | 12:06 AM

పారిస్ ఒలింపిక్స్‌లో మనుభాకర్‌ బుల్లెట్ ఈసారి గురి తప్పలేదు. టీనేజ్‌లోనే సంచలన ప్రదర్శనలతో ప్రపంచ మేటి షూటర్లలో ఒకరుగా ఎదిగిన ఆమె... 12 ఏళ్ల ఎదరుచూపులకు తెరదింపుతూ ఒలింపిక్స్‌లో కాంస్యాన్ని కైవసం చేసుకుంది. దీంతో చాలా రోజుల తరువాత షూటింగ్‌ విభాగంలో భారత్‌కు పతకం వచ్చింది.

Paris Olympics: ఒలింపిక్స్‌లో పేలిన భారత్‌ తూటా.. పీవీ సింధు, నిఖ‌త్ జ‌రీన్ శుభారంభం.. ఫైనల్‌కు అర్హత సాధించిన అర్జున్..
Olympics
Follow us on

పారిస్ ఒలింపిక్స్‌లో మనుభాకర్‌ బుల్లెట్ ఈసారి గురి తప్పలేదు. టీనేజ్‌లోనే సంచలన ప్రదర్శనలతో ప్రపంచ మేటి షూటర్లలో ఒకరుగా ఎదిగిన ఆమె… 12 ఏళ్ల ఎదరుచూపులకు తెరదింపుతూ ఒలింపిక్స్‌లో కాంస్యాన్ని కైవసం చేసుకుంది. దీంతో చాలా రోజుల తరువాత షూటింగ్‌ విభాగంలో భారత్‌కు పతకం వచ్చింది. అంతేకాదు షూటింగ్‌లో ఒలింపిక్స్‌ పతకం కొట్టిన తొలి భారత మహిళగా మనుభాకర్‌ రికార్డులకెక్కింది. దీంతో మనుభాకర్‌ కుటుంబ సభ్యుల సంబరాలు అంబరాన్నంటాయి. ప్రధాని మోదీ సైతం ఎక్స్‌ ద్వారా మనుభాకర్‌ను ప్రశంసలతో ముంచెత్తారు.

ఇక పురుషుల 10మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో అర్జున్ బబుతా అదరగొట్టాడు. అతడు 630 స్కోరుతో ఏడో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించాడు.

ఇటు తొలిసారి ఒలింపిక్స్‌ బరిలోకి దిగిన భారత స్టార్‌ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ శుభారంభం చేసింది. రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్‌ అయిన నిఖత్‌… మహిళల 50 కేజీల విభాగంలో ప్రిక్వార్టర్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆరంభ పోరులో 5-0తో జర్మనీకి చెందిన మ్యాక్సీ కరీనాని ఓడించింది.

భారత స్టార్ షట్లర్, తెలుగు అమ్మాయి పీవీ సింధు సైతం టోర్నమెంట్‌లో శుభారంభం చేసింది. తొలి మ్యాచ్‌లో గ్రాండ్‌ విక్టరీ సాధించింది. మాల్దీవులకు చెందిన క్రీడాకారిణిపై అలవోకగా విజయం సాధించింది. 29 నిమిషాల్లోనే వరుసగా రెండు గేమ్‌లలో ప్రత్యర్థిని చిత్తుచేసింది. మరోవైపు పలు ఇతర క్రీడాంశాల్లోనూ భారత ఆటగాళ్లు తొలి రౌండ్లలో విజయం సాధించారు.

వీడియో చూడండి..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..