పారిస్ ఒలింపిక్స్‌లో ఈ రోజు కేవలం 3 గంటల్లో అద్భుతం జరిగే అవకాశం ఉంది. ఇది అద్భుతమైన బంగారు పతకాన్ని గెలుచుకునే రూపంలో ఆవిష్కృతం అయ్యే చాన్స్ ఉంది. భారత్‌కు మెడల్ లేని ఆర్చరీలో బోణీ కొట్టేందుకు మహిళల ఆర్చరీ టీమ్ సిద్దంగా ఉంది. అవును భారతదేశానికి చెందిన ముగ్గురు యువతలు 3 గంటల్లో బంగారు పతకం సాధించడం ద్వారా ఆదివారం వేడుకల ఆనందాన్ని రెట్టింపు చేయవచ్చు. విలువిద్య ఈవెంట్ లో ఈ అద్భుతం జరిగే చాన్స్ ఉంది. వాస్తవానికి జూలై 28న జరిగే పారిస్ ఒలింపిక్స్‌లో భారత మహిళల ఆర్చరీ జట్టు పతకాల ఈవెంట్‌లో పాల్గొననుంది. దీంతో అందరి దృష్టి భారతదేశానికి చెందిన దీపికా కుమారి, భజన్ కౌర్, అంకితపైనే ఉంది.
సాయంత్రం 5:45 గంటలకు క్వార్టర్ ఫైనల్స్
పారిస్ ఒలింపిక్స్‌లో మహిళల ఆర్చరీ ఈవెంట్‌లు భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5:45 గంటలకు ప్రారంభమవుతాయి. ముందుగా క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ సాగనుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే తర్వాత భారత మహిళల జట్టు సెమీ-ఫైనల్‌లోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. భారత మహిళల ఆర్చరీ జట్టు ర్యాంకింగ్ రౌండ్‌లో 4వ స్థానంలో నిలిచి క్వార్టర్ ఫైనల్స్‌లో చోటు దక్కించుకుంది.
సాయంత్రం 7:17 తర్వాత సెమీ ఫైనల్
దీపికా కుమారి, భజన్ కౌర్, అంకిత క్వార్టర్ ఫైనల్స్‌లో విజయం సాధించి సెమీ ఫైనల్స్‌లో చోటు దక్కించుకుంటే.. పతకానికి మరో అడుగు దూరంలో ఉంటారు. సెమీ ఫైనల్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7:17 గంటల తర్వాత జరుగనుంది.
రాత్రి 8:18 గంటలకు కాంస్య పతకం మ్యాచ్
ఒకవేళ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఓడిపోతే భారత జట్టు కాంస్య పతకం కోసం పోటీపడేలా కనిపిస్తోంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8:18 గంటలకు మహిళల ఆర్చరీలో కాంస్య పతక పోరు జరగనుంది.
రాత్రి 8:41 గంటలకు గోల్డ్ మెడల్ మ్యాచ్
ఒకవేళ దీపికా కుమారి, భజన్‌కౌర్, అంకిత సెమీఫైనల్‌లో విజయం సాధించి ఫైనల్‌కు అడుగు పెడితే.. బంగారు పతకాన్ని సాధించాలనే కలను సాకారం చేసుకునే అవకాశం ఉంటుంది. ఫైనల్స్‌కు చేరుకున్న తర్వాత గోల్డ్ మెడల్ మ్యాచ్ ఆడనున్నారు. భారతదేశం కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 8:41లో జరగనుంది.
3 గంటల్లో బంగారం వస్తుందా?
సాయంత్రం 5:45 నుండి రాత్రి 8:41 వరకు అంతా భారతీయ మహిళా ఆర్చర్లకు అనుకూలంగా ఉంటె.. దీపిక, భజన్ , అంకిత ఈ ముగ్గురు యువతులు పారిస్ ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించడం ద్వారా చరిత్ర సృష్టించగలరు. ఒలింపిక్స్‌లో ఆర్చరీ మొదలై 36 ఏళ్ల అయిన తర్వాత భారత్ కు మొదటి పకతం అందించిన అమ్మాయిలుగా చరిత్ర సృష్టించగలరు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..