క్రికెట్ మ్యాచ్‌లో ఆర్మీ టోపిలు ధరించడంపై పాక్ అభ్యంతరం

ఇస్లామాబాద్‌: పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు నివాళిగా భారత్‌-ఆస్ట్రేలియాల మధ్య శుక్రవారం  జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో భారత క్రికెటర్లు ఆర్మీ టోపీలు ధరించడాన్ని పాక్‌ తప్పుపట్టింది. భారత టీం క్రికెట్‌ను రాజకీయం చేసిందంటూ దీనిపై చర్యలు తీసుకోవాలని ఐసీసీ(ఇంటర్నేషనల్‌ క్రికెట్ కౌన్సిల్‌)ను పాక్‌ మంత్రి పవాద్‌ చౌదరీ కోరారు. భారత్‌ చేసిన ఈ చర్యకు నిరసనగా ఐసీసీ ముందు ఫిర్యాదు చేయాలని ఆయన పీసీబీకు విన్నవించారు. ఒకవేళ తదుపరి మ్యాచుల్లో కూడా భారత టీం ఆర్మీ […]

క్రికెట్ మ్యాచ్‌లో ఆర్మీ టోపిలు ధరించడంపై పాక్ అభ్యంతరం

Updated on: Mar 09, 2019 | 5:11 PM

ఇస్లామాబాద్‌: పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు నివాళిగా భారత్‌-ఆస్ట్రేలియాల మధ్య శుక్రవారం  జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో భారత క్రికెటర్లు ఆర్మీ టోపీలు ధరించడాన్ని పాక్‌ తప్పుపట్టింది. భారత టీం క్రికెట్‌ను రాజకీయం చేసిందంటూ దీనిపై చర్యలు తీసుకోవాలని ఐసీసీ(ఇంటర్నేషనల్‌ క్రికెట్ కౌన్సిల్‌)ను పాక్‌ మంత్రి పవాద్‌ చౌదరీ కోరారు. భారత్‌ చేసిన ఈ చర్యకు నిరసనగా ఐసీసీ ముందు ఫిర్యాదు చేయాలని ఆయన పీసీబీకు విన్నవించారు.

ఒకవేళ తదుపరి మ్యాచుల్లో కూడా భారత టీం ఆర్మీ క్యాప్‌లను ధరించటం కొనసాగిస్తే పాక్ టీం కూడా కశ్మీర్‌లో దురాగతాలకు పాల్పడుతున్న భారత్‌కు నిరసనగా నలుపు బ్యాండ్‌లు ధరిస్తారని చెప్పారు. అంతకుముందు రాంచీలో జరిగే మూడో వన్డేలో అమర జవాన్లకు నివాళిగా భారత క్రికెటర్లు ఆర్మీ టోపీలు పెట్టుకొని మ్యాచ్‌ ఆడతారని బీసీసీఐ ప్రకటించింన సంగతి తెలిసిందే.