వ్యాక్సిన్ వేయించుకోను. అవసరమైతే ఆటకైనా దూరమవుతాగాని.. నా సిద్ధాంతాన్ని వదలను. ఈ మాటలంటోంది ఎవరో కాదు.. వరల్డ్ నెంబర్ వన్ టెన్నిస్ స్టార్ జకోవిచ్.. ఓవైపు కరోనా విజృంభిస్తుంటే.. ఈ స్పోర్ట్స్ ఐకాన్ మాత్రం విచ్చలవిడిగా తిరిగేశాడు. టెన్నిస్‌లో వరల్డ్ నెంబర్ వన్‌గా ఉన్న నొవాక్ జకోవిచ్ కనీసం వ్యాక్సిన్ వేసుకోకుండా దేశాలు చుట్టేశాడు. ఫస్ట్ వేవ్‌లోనే కరోనా బారిన పడినా.. ఇప్పటి వరకు వ్యాక్సిన్ మాత్రం వేసుకోలేదు. దీంతో గత నెలలో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడలేకపోయాడు. ఆ సమయంలో అతడి వ్యవహారశైలి వివాదాస్పదమైంది. ఆస్ట్రేలియాలోకి ఎంటర్ కావాలంటే వ్యాక్సినేషన్ తప్పనిసరి. కాని జకోవిచ్ టీకా వేసుకోలేదు. దీంతో ఎయిర్‌పోర్టులోనే ఆపేశారు. ఆతర్వాత ఆట ఆడడానికి అనుమతించినా.. అధికారులు కోర్టుకెక్కారు. దీంతో అతడిని వెంటనే దేశం నుంచి పంపేయాలని తీర్పు వచ్చింది. తప్పనిసరి పరిస్థితుల్లో ఇంటికెళ్లిపోయాడు జకోవిచ్.
ఇదే విషయాన్ని ఓ విలేఖరి ప్రస్తావిస్తే.. వ్యాక్సిన్‌కు తాను వ్యతిరేకం కాదని, బలవంతంగా తీసుకోమని ఒత్తిడి తెస్తే మాత్రం భవిష్యత్తులో జరిగే టెన్నిస్ టోర్నీలకు దూరంగా ఉండేందుకైనా సిద్ధంగా ఉన్నానని సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. ఈ ఏడాది జరగబోయే వింబుల్డన్, ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలను వదులుకునేందుకు రెడీగా ఉన్నాడు.
వ్యాక్సినేషన్ అనేది ఇది తన వ్యక్తిగత నిర్ణయం మాత్రమేనని, వ్యాక్సిన్ వ్యతిరేక ఉద్యమానికి తానేమీ మద్దతు ఇవ్వడం లేదన్నాడు. శరీర ధర్మానికి తగ్గట్లుగానే తన నిర్ణయాలు ఉంటాయని, ఈ విషయంలో తననెవరైనా బలవంతం చేస్తే ట్రోఫీలు వదులుకోవడం పెద్ద సమస్య కాదన్నాడు జకోవిచ్.
మరి వింబుల్డన్ జరిగే బ్రిటన్ ప్రభుత్వం.. ఫ్రెంచ్ ఓపెన్ జరిగే ఫ్రాన్స్ ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయో చూడాలి. మనోడు ఆడతాడా.. ఊడతాడా అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.
ఇవి కూడా చదవండి: Ukraine Russia Crisis: ర్యష్యా వెనక్కి తగ్గలేదు.. పుతిన్ యుద్ధతంత్రంపై అమెరికా కీలక ప్రకటన..
Rudraksha Tree: మన తెలుగు నేలపై కాస్తున్న రుద్రాక్షలు.. ఎక్కడో తెలుసా?