Wimbledon 2021: ఫెదరర్‌కు షాక్.. సెమీస్‌లోకి ఎంటరైన జకోవిచ్, షపొవలోవ్.. ముగిసిన సానియా-బోపన్న ప్రయాణం!

|

Jul 08, 2021 | 6:47 AM

వింబుల్డన్‌ టోర్నీలో ఫెదరర్‌ ఆటముగిసింది. ఎనిమిదిసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఫెదరర్‌కు పోలెండ్‌ యంగ్ ప్లేయర్ హర్కజ్‌ షాకిచ్చి, సెమీఫైనల్‌కు చేరాడు. మరోవైపు డిఫెండింగ్‌ ఛాంపియన్‌ జకోవిచ్‌, యువ ఆటగాడు షపొవలోవ్‌ సెమీస్‌కు చేరారు.

Wimbledon 2021: ఫెదరర్‌కు షాక్.. సెమీస్‌లోకి ఎంటరైన జకోవిచ్, షపొవలోవ్.. ముగిసిన సానియా-బోపన్న ప్రయాణం!
Wimbledon 2021
Follow us on

Wimbledon 2021: వింబుల్డన్‌ టోర్నీలో ఫెదరర్‌ ఆటముగిసింది. ఎనిమిదిసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఫెదరర్‌కు పోలెండ్‌ యంగ్ ప్లేయర్ హర్కజ్‌ షాకిచ్చి, సెమీఫైనల్‌కు చేరాడు. మరోవైపు డిఫెండింగ్‌ ఛాంపియన్‌ జకోవిచ్‌, యువ ఆటగాడు షపొవలోవ్‌ సెమీస్‌కు చేరారు. బుధవారం జరిగిన క్వార్టర్స్‌లో దిగ్గజ ప్లేయర్ ఫెదరర్‌కు షాక్ తగిలింది. ఓ యంగ్ ప్లేయర్ చేతిలో ఓడిపోవడంతో.. వింబుల్డన్ టోర్నీ నుంచి ఫెదరర్ సెమీస్‌కు చేరకుండానే వెనుదిరిగాడు. పోలెండ్‌కి చెందిన 14వ సీడ్ హ్యూబర్ట్‌ హర్కజ్‌ క్వార్టర్‌ఫైనల్లో ఫెదరర్‌తో తలపడ్డాడు. ఈ పోరులో 6-3, 7-6 (7-4), 6-0తో గెలిచి మొదటిసారి వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ సెమీస్‌లోకి ఎంటరయ్యాడు. 39 ఏళ్ల ఫెదరర్‌పై పోలాండ్ కుర్రాడు మొదటి నుంచి ఆధిపత్యం కొనసాగించాడు. తొలి సెట్‌ గెలుచుకున్న హర్కజ్.. రెండో సెట్‌లోనూ అదే జోరు కొనసాగించాడు. ఇక మూడో సెట్లో పూర్తి ఆధిపత్యంతో చూపించి మ్యాచ్‌లో విజేతగా నిలిచాడు. కాగా, వింబుల్డన్‌లో ఫెదరర్ ఓ సెట్‌ను 0-6తో ఓడిపోవడం ఇదే మొదటిసారి. పోలెండ్ యువ ప్లేయర్ హర్కజ్.. తన తదుపరి పోరులో బెరెటిని, అలియాసిమె మధ్య జరిగే పోరులో విజేతతో సెమీస్‌లో ఆడనున్నాడు.

మరోవైపు 20వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ కోసం బరిలోకి దిగిన ప్రపంచ నంబర్‌వన్‌ సెర్బియా ఆటగాడు జకోవిచ్‌ సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. క్వార్టర్‌ఫైనల్లో 6-3, 6-4, 6-4తో హంగేరికి చెందిన మర్తోన్‌ ఫుక్సోవిచ్‌పై తిరులేని ఆధిపత్యం ప్రదర్శించాడు. అద్భుత ఫామ్‌లో ఉన్న జకోవిచ్ ప్రత్యర్థిని ఏ విషయంలోనూ కోలుకోనివ్వకుండా దాడి చేశాడు. 34 ఏళ్ల జకోవిచ్‌కు ఇది పదో వింబుల్డన్‌ సెమీఫైనల్‌. జకోవిచ్ సెమీఫైనల్‌లో కెనడాకు చెందిన 22 ఏళ్ల షపొవలోవ్‌తో తలపడనున్నాడు. ఇక పదో సీడ్‌ షపొవలోవ్‌ క్వార్టర్‌ఫైనల్లో 6-4, 3-6, 5-7, 6-1, 6-4తో రష్యాకు చెందిన కచనోవ్‌ పై విజయం సాధించి, సెమీఫైనల్ చేరాడు. ఇక భారత్ ప్లేయర్ల పోరు వింబుల్డన్ లో ముగిసింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సానియా మీర్జా, రోహన్‌ బోపన్న ఓడిపోయి, మూడో రౌండ్‌ లోనే టోర్నీ నుంచి నిష్ర్కమించారు. సానియా మీర్జా- రోహన్ బోపన్న జోడీ 3-6, 6-3, 9-11తో జీన్‌ జులియన్‌ రోజర్‌ (నెదర్లాండ్స్‌), ఆండ్రియా క్లెపాచ్‌ (స్లొవేనియా) జోడీ చేతిలో పరాజయం పాలయ్యారు.

Also Read:

Abhimanyu Easwaran: ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ విషయంలో కోహ్లీ, చేతన్ శర్మల మధ్య విభేదాలు.. భారత క్రికెట్‌లో ఇలాంటివి ఎన్నో..!

India vs England: కౌంటీ బరిలో యాష్… ఇంగ్లండ్‌ సిరీస్‌కు ముందు ప్రాక్టీస్‌పై కన్నేసిన స్టార్ స్పిన్నర్!