Wimbledon 2021: ఆస్ట్రేలియన్ ప్లేయర్ నిక్ కిర్గియోస్ వింబుల్డన్ లో మూడో రౌండ్ లోకి ఎంటరయ్యాడు. అయితే, తన మూడవ రౌండ్ పోటీ కోసం అన్నీ సిద్ధం చేసుకుని కోర్టులోకి ఎంటరయ్యాడు. తీరా చూస్తే.. గ్రాస్ కోర్ట్ షూస్ వేసుకోలేదు. దీంతో వార్మప్ కొంచెం ఆలస్యంగా ప్రారంభమైంది. ఈ వీడియోను నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఫుల్ గా ఆడుకుంటున్నారు. అసలు విషయలోకి వెళ్తే.. ఫెలిక్స్ వింబుల్డన్ లో తన మూడో రౌండ్ లో అగర్ అలియాసిమ్‌తో తలపడాల్సి ఉంది. శనివారం జరిగిన ఈ మ్యాచ్ లో ఈ ఆస్ట్రేలియన్ ప్లేయర్ వల్ల కొంచెం ఆలస్యంగా వార్మప్ ప్రారంభమైంది. ఎందుకంటే ఈ ప్లేయర్ మ్యాచ్ కోసం నంబర్ 1 కోర్టులో అడుగుపెట్టినప్పుడు.. అతని వద్ద గ్రాస్-కోర్ట్ బూట్లు లేవు. దీంతో వెంటనే ఆయన ‘నేను నా టెన్నిస్ షూస్ ను లాకర్ గదిలో మర్చిపోయాను..’ అంటూ నవ్వుతూ అసలు విషయం చెప్పాడు. దీంతో వార్మప్ మ్యాచ్ లేట్ గా ప్రారంభించాడు ఈ ఆస్ట్రేలియన్ ప్లేయర్. మ్యాచ్ కోసం వస్తూ.. దుస్తులు, రాకెట్లు తనతోపాటు తెచ్చుకుని, బూట్లను మాత్రం లాకర్ లో మర్చిపోయానని చమత్కరించాడు. అసలు విషయం చెప్పడంతో.. వింబుల్డన్ ఉద్యోగి ఒకరు అతని షూస్ ని తీసుకొని పరుగున అతని వద్దకు వచ్చింది. దీంతో వార్మప్ కొద్దిగా ఆలస్యంగా ప్రారంభించారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. ఈ ఆస్ట్రేలియన్ ప్లేయర్ కోసం స్పెషల్ షూస్ డెలివరీ అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్ చేశారు. బాగుందని ఒకరు, ఎందుకిలా మర్చిపోయావంటూ కొందరు కామెంట్ చేశారు.
మ్యాచ్ విషయానికి వస్తే.. మెన్స్ సింగిల్స్ లో నిక్ కిర్గియోస్ ఫెలిక్స్(ఆస్ట్రేలియా) మూడో రౌండ్ లో అగర్-అలియాస్సిమ్ (కెనడా)తో తలపడ్డాడు. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ప్లేయర్ గాయంతో టోర్నీ నుంచి నిష్ర్కమించడంతో.. అగర్ తరువాతి రౌండ్ లోకి ప్రవేశించాడు. మొదటి రౌండ్ లో 6-2 తో దూసుకొచ్చిన నిక్.. తరువాతి రౌండ్ లో గాయపడడంతో మ్యాచ్ వాకోవర్ గా నిలిచిపోయింది.
ఈ వీడియోను మీరూ చూడండి..
Special shoe delivery for @NickKyrgios #Wimbledon pic.twitter.com/UUhElrCv4s
— Tennis GIFs ?? (@tennis_gifs) July 3, 2021
Also Read:
Mithali Raj: ఉమెన్స్ క్రికెట్ లో మిథాలీరాజ్ సరికొత్త చరిత్ర.. తొలి మహిళగా రికార్డు..!
Euro Cup 2020: యూరో కప్‌లో డెన్మార్క్ సంచలనం.. 29 ఏళ్ల తరువాత మొదటి సారి.!