Usain Bolt: ఉసేన్ బోల్ట్​ దంపతులకు కవలలు.. సోషల్​ మీడియాలో రచ్చ చేస్తోన్న పేర్లు!

ఆల్ టైమ్ ఒలింపిక్ గ్రేట్ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్, అతని భార్య కాసి బెన్నెట్ జంటకు ఇటీవల కవల పిల్లలు జన్మించారు. ఈ మేరకు వారు సోషల్ మీడియా వేదికగా కవల పిల్లల ఫొటోను షేర్ చేశారు.

Usain Bolt: ఉసేన్ బోల్ట్​ దంపతులకు కవలలు.. సోషల్​ మీడియాలో రచ్చ చేస్తోన్న పేర్లు!
Usain Bolt

Edited By: Anil kumar poka

Updated on: Jul 05, 2021 | 5:28 PM

Usain Bolt: ఆల్ టైమ్ ఒలింపిక్ గ్రేట్ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్, అతని భార్య కాసి బెన్నెట్ జంటకు ఇటీవల కవల పిల్లలు జన్మించారు. ఈ మేరకు వారు సోషల్ మీడియా వేదికగా కవల పిల్లల ఫొటోను షేర్ చేశారు. వీరికి థండర్ బోల్ట్, సెయింట్ లియో బోల్ట్ అని పేర్లు పెట్టినట్లు ప్రకటించారు. ఫాదర్స్ డే సందర్భంగా ఫ్యామిలీ ఫోటోను బోల్ట్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. కవలలు ఎప్పుడు జన్మించారో మాత్రం వెల్లడించలేదు. క్యాప్షన్‌లో తన పిల్లల పేర్ల పక్కన మూడు మెరుపు బోల్ట్ ఎమోజీలను ఉంచాడు. ఉసేన్ బోల్డ్ దంపతులు, కవలలతో పాటు కుమార్తె కలిసి ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకున్నారు. ఈ ఫొటోను ఉసేన్ బోల్డ్ భార్య కాసి బెన్నెట్ షేర్ చేశారు. ఇందులో ” హ్యాపీ ఫాదర్స్ డే టూ మై లవ్! ఉసేన్ బోల్డ్.. ఈ కుంటుబానికి నువ్వో రాక్‌ లాంటోడివి. మన పిల్లలకు నువ్వో గొప్ప తండ్రివి. నీపై అంతులేని ప్రేమను కలిగి ఉన్నామని” భర్తపై ఉన్న ప్రేమను వ్యక్తపరిచింది.

కాగా, ఉసేన్ బోల్ట్ కుమార్తే ‘ఒలింపియా బోల్ట్’ 2020 మేలో జన్మించింది. రెండు నెలల తరువాత ఆమె పేరును ప్రకటించాడు ఈ పరుగుల వీరుడు. ఇక ఈ ఫొటోను చూసిన నెటిజన్లు.. కామెంట్లతో పరుగులు పెట్టించారు. 2008, 2012 , 2016 క్రీడలలో ఎనిమిది బంగారు పతకాలు సాధించిన 34 ఏళ్ల బోల్ట్.. 2017 లో రిటైర్మెంట్ ప్రకటించడంతో.. వచ్చే నెలలో టోక్యోలో జరిగే ఒలింపిక్స్‌లో పోటీ చేయడం లేదు.

చరిత్రలో అత్యంత వేగంగా పరిగెత్తే బోల్ట్…100 మీటర్లు, 200 మీటర్ల పరుగుల పోటీల్లో ప్రపంచ రికార్డులను సాధించాడు. ఫాస్టెస్ట్ మ్యాన్‌గా చ‌రిత్ర‌లో స్థానం సంపాదించిన బోల్ట్‌.. 100, 200 మీట‌ర్ల ఈవెంట్‌లో వ‌రుస‌గా మూడు ఒలింపిక్స్‌లో స్వ‌ర్ణాలు సాధించాడు. తన కెరీర్‌లో 23 ఛాంపియన్‌షిప్ స్వర్ణాలు గెలుచుకున్న బోల్ట్.. కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తరువాత ఫుట్‌బాల్ ఆటపై ఆసక్తిగా ఉన్నాడు. అయితే, ఈ ఆటలో కాంట్రాక్టును దక్కించుకోలేక పోయాడు. అనంతరం 2019 లో అన్ని క్రీడల నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు.

Also Read:

International Yoga Day 2021: “ప్రపంచానికి యోగా నేర్పిన ఘనత భారత్‌ దే”: భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్

Milkha Singh: “రియల్ హీరోకు.. రీల్ హీరోకి తేడా తెలియదా”..! నోయిడా స్టేడియం సిబ్బందిపై నెటిజన్ల ఫైర్

Tokyo 2020 Summer Olympics: పీవీ సింధు ఒలింపిక్ పతకం సాధించడం అంత సులభం కాదు: జ్వాలా గుత్తా