వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ (WWE) మాజీ ఛాంపియన్ ‘ది గ్రేట్ ఖలీ’ అంటే దలీప్ సింగ్ రానా మరోసారి వార్తల్లో నిలిచాడు. టోల్ ప్లాజా ఉద్యోగులతో గొడవ పడుతున్న వీడియో నెట్టింట్లో వైరలవుతోంది. ఐడీ కార్డు అడిగినందుకు టోల్ ప్లాజా ఉద్యోగిని ఖలీ చెప్పుతో కొట్టినట్లు ఈ వీడియో ద్వారా ప్రచారం జరుగుతోంది. అయితే, ఖలీ మాత్రం.. టోల్‌ఫ్లాజా ఉద్యోగులు తనను బ్లాక్ మెయిల్ చేశారని చెబుతున్నాడు. ఒక ఉద్యోగి ఫోటో తీయడానికి కారులోకి ప్రవేశించిన సమయంలో ఇది జరిగిందని తెలుస్తోంది.
జలంధర్ నుంచి కర్నాల్ వెళ్తున్న సమయంలో..
డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ జలంధర్ నుంచి కర్నాల్‌కు వెళ్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. ఇదిలా ఉంటే, ఫిల్లోర్ సమీపంలోని టోల్ ప్లాజా అని చెబుతున్నారు. ఫోటోలు తీయడానికి ఓ ఉద్యోగి కారులోకి వస్తున్నాడని ఖలీ చెప్పుకొచ్చాడు. నిరాకరించడంతో వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత మిగిలిన ఉద్యోగులు వచ్చి అతని కారును చుట్టుముట్టి బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించారంట.
ఈ క్రమంలో రెజ్లర్ ఖలీ తన కారు నుంచి బయటకు వచ్చి వారిని అడ్డుతప్పించి, కారును బయటకు తీశాడు. ఇంతలో ఒక ఉద్యోగి ఖలీని అడ్డంకిని తొలగించకుండా ఆపుతున్నట్లు వీడియోలో చూడొచ్చు. కానీ, ఈ స్టార్ రెజ్లర్ అతనిని పట్టుకొని పక్కకు నెట్టేస్తాడు.
Viral Video of Argument between WWE Superstar ‘The Great #Khali‘ and Toll workers, Somewhere In Punjab. pic.twitter.com/MsCdPslcLs
— Nikhil Choudhary (@NikhilCh_) July 11, 2022
మరోవైపు ఖలీ నుంచి ఐడీ కార్డు మాత్రమే అడిగానని సదరు ఉద్యోగి చెబుతున్నాడు. ఈ విషయంపై ఖలీ అతడిని చెంపదెబ్బ కొట్టాడు. ఓ ఉద్యోగి ఖలీని కోతి అని కూడా పిలుస్తున్నట్లు వీడియోలో వినిపిస్తోంది. కోపంతో, ఉద్యోగులందరూ ఖలీని బయటకు వెళ్లనివ్వ లేదు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని గొడవను సద్దుమణిగించారు.