HBD PV Sindhu: భారత బ్యాడ్మింటన్ క్వీన్ పీవీ సింధు.. ప్రస్తుతం ఒలింపిక్ సన్నాహాల్లో మునిగిపోయింది. ఈ సారి కచ్చితంగా బంగారు పతకంతోనే తిరిగివస్తానంటూ ధీమా వ్యక్తం చేస్తూ.. ప్రాక్టీస్ లో మునిగిపోయింది. జాతీయ, అంతర్జాతీ స్థాయిలో ఎన్నో పతకాలు సాధించిన పీవీ సింధు.. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిందనడంలో సందేహం లేదు. నేడు పీవీ సింధు పుట్టిన రోజు. 26 వసంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా మీకు తెలియని 5 విషయాలను చూద్దాం..
1. సుధీర్ఘ మ్యాచ్ లో భాగస్వామిగా..
భారత సూపర్ స్టార్ బ్యాడ్మింటన్ చరిత్రలో సుధీర్ఘంగా సాగిన మహిళల సింగిల్స్ మ్యాచ్ లో భాగస్వామిగా ఉంది. పీవీ సింధు రెండో స్థానంలో నిలిచింది. 2017 ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో సింధు 21-19, 20-22, 22-20తో జపాన్‌కు చెందిన నోజోమి ఒకుహారా తో సుదీర్ఘ పోరాడింది. ఓకుహారాకు వ్యతిరేకంగా ఆమె చేసిన స్లగ్‌ఫెస్ట్ రికార్డ్.. చరిత్రలోకి ఎక్కింది. ఈ మ్యాచ్ 110 నిమిషాల పాటు సాగింది. ఇంత సుధీర్ఘమైన రికార్డుతో ఈ మ్యాచ్ రెండో స్థానంలో నిలిచింది. మరో నిమిషం పాటు ఆట కొనసాగి ఉంటే.. సుధీర్ఘమైన మ్యాచ్లో ఈ జంట తొలిస్థానంలో నిలిచేవారు. 73-షాట్లతో సుధీర్ఘమైన మ్యాచ్ తో విజయం సాధించింది.
2. వరల్డ్ ఛాంపియన్స్ లో 5 లేదా అంతకంటే ఎక్కువ పతకాలు సాధించిన రెండవ మహిళ
ప్రపంచ ఛాంపియన్స్ లో పీవీ సింధు బలమైన ముద్ర వేసింది. రెండు రజత, రెండు వెండి పతకాలతో పాటు ఓ బంగారు పతకం సాధించి దేశానికి గర్వ కారణమైంది. ప్రపంచ వ్యప్తంగా రెండో స్థానంలో నిలవగా, దేశంలో మొదటి స్థానంలో నిలిచింది. ఆమె చైనా షట్లర్ జాంగ్ నిగ్ తో సమానంగా 5 పతకాలతో నిలిచింది.
3. మహిళా అథ్లెట్లలో అత్యధిక సంపాదన..
2019 ఫోర్బ్ లిస్టుల ప్రకారం అత్యధికంగా ఆర్జిస్తున్న భారత మహిళా అథ్లెట్ గా పేరుగాంచింది. పీవీ సింధు 5.5 మిలియన్ డాలర్ల సంపాదనతో మహిళా అథ్లెట్లలో టాప్ 15 ప్లేస్ లో నిలిచింది. ప్రైజ్ మనీతోపాటు పలు యాడ్ లతో ఆమె సంపాదనను లెక్కించినట్లు తెలుస్తోంది. అలాగే బ్రిడ్జిస్టోన్, జేబీఎల్, నోకియా, పానాసోనిక్, బ్యాంక్ ఆఫ్ బరోడా లాంటి ఎన్నో బ్రాండ్ లకు అంబాసిడర్ గా ఉంది.
4. బీడబ్ల్యూఎఫ్ కే బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్నిక..
గతేడాది ఏప్రిల్ లో బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ పీవీ సింధుని బ్రాండ్ అంజాసిడర్ గా ఎన్నుకుంది. బ్యాడ్మింటన్ ఆటను మరింతగా ప్రజలకు దగ్గర చేసేందుకు ‘ఐ యామ్ బ్యాడ్మింటన్’ అంటూ ఓ క్యాంపేన్ ను కూడా రన్ చేసింది.
5. అతి పిన్న వయసులో పద్మశ్రీతోపాటు ఒలింపిక్ పతకాన్ని గెలుచుకుంది
2015లో పీవీ సింధుని భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. అతి తక్కువ వయసులో ఇలాంటి అత్యున్నత అవార్డు పొంది, చరిత్రలోకి ఎక్కింది. అలాగే 2014 లో సింధు.. కామన్ వెల్త్ గేమ్స్, ఏసియన్ గేమ్స్, వరల్డ్ బ్యాడ్మింటన్ లో రజత పతకాలను సాధించి బాగా పాపులర్ అయింది. వీటితో బ్యాక్ టు బ్యాక్ పతకాలు సాధించిన తొలి మహిళగా రికార్డుల్లో తన పేరును లిఖించుకుంది. అలాగే ఒలింపిక్స్ లోనూ అతి తక్కువ వయసులో పతకం సాధింన తొలి మహిళగా నిలిచింది.
Also Read:
Viral Photo: వింబుల్డన్ లో సచిన్, విరాట్ జంటలు.. వైరలవుతోన్న ఆనాటి ఫొటో!
Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్ లో అథ్లెట్స్ కరోనా పాజిటివ్ గా తేలితే ఏం చేస్తారో తెలుసా..?
Anil kumble Meets YS Jagan: ఏపీ సీఎం జగన్ ను కలిసిన టీమిండియా మాజీ క్రికెటర్..!