Watch Video: ‘సై’ స్పీచ్‌తో రెచ్చిపోయిన హెడ్ కోచ్.. మెస్సీకి షాకిచ్చిన సౌదీ ఆటగాళ్లు.. సంచలన విజయం వెనుక అసలు స్టోరీ ఇదే..

|

Nov 30, 2022 | 9:56 PM

అర్జెంటీనా టీంకు చావు దెబ్బ తగిలింది. ఎంత పోరాడినా చివరికి పోటీలో 2-1 తేడాతో ఓడిపోయారు. అర్జెంటీనాపై విజయంతో సౌదీ ఇప్పుడు ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో తొలిసారిగా రౌండ్ ఆఫ్ 16లో చోటు దక్కించుకుంది.

Watch Video: సై స్పీచ్‌తో రెచ్చిపోయిన హెడ్ కోచ్.. మెస్సీకి షాకిచ్చిన సౌదీ ఆటగాళ్లు.. సంచలన విజయం వెనుక అసలు స్టోరీ ఇదే..
Saudi Arabia Coach Herve Renards Half Time Speech
Follow us on

అర్జెంటీనా జట్టుపై సౌదీ అరేబియా 2-1 తేడాతో సంచలన విజయం సాధించి, యావత్ ప్రపంచానికి షాక్ ఇచ్చింది. FIFA ప్రపంచ కప్2022 గ్రూప్ సి ఓపెనర్‌(మంగళవారం, నవంబర్ 22)లో ఈ అద్భుతం జరిగింది. మెస్సీ అండ్ కో టీం సులువుగా విజయం సాధిస్తారని అందరూ అనుకున్నారు. కానీ, సౌదీ అందరినీ ఆశ్చర్యపరిచింది. 10వ నిమిషంలో మెస్సీ అద్భుతమైన గోల్ చేయడంతో విరామ సమయానికి ఒక గోల్‌తో వెనుకంజలో ఉన్నారు. విరామం తర్వాత సౌదీ అరేబియా ఊహించలేని పని చేసి, అందరినీ ఆశ్చర్యపరిచింది. వేగంగా వరుసగా రెండు గోల్స్ చేసింది.

దీంతో అర్జెంటీనా టీంకు చావు దెబ్బ తగిలింది. ఎంత పోరాడినా చివరికి పోటీలో 2-1 తేడాతో ఓడిపోయారు. అర్జెంటీనాపై విజయంతో సౌదీ ఇప్పుడు ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో తొలిసారిగా రౌండ్ ఆఫ్ 16లో చోటు దక్కించుకోగలిగింది. మరోవైపు అర్జెంటీనా గ్రూప్‌ దశలో నుంచే తప్పుకునే ప్రమాదంలో పడింది.

హాఫ్ టైమ్ విరామం తర్వాత అర్జెంటీనా-సౌదీ అరేబియా మధ్య ఆట మారిపోయింది. తాజాగా అందుక సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. సౌదీ కోచ్ ఇచ్చిన స్పీచ్‌తో ఆటగాళ్లు రెచ్చిపోయారు.

ఇవి కూడా చదవండి

సౌదీలో స్ఫూర్తి నింపిన హెచ్ కోచ్..

హెడ్ కోచ్ హెర్వ్ రెనార్డ్ ఆటగాళ్లలో స్ఫూర్తి నింపాడు. అచ్చం సై సినిమాలో రాజీవ్ కనకాల చేసిన పనే ఇక్కడ కూడా మనం చూడొచ్చు. సౌదీ ఓటమి అంచున ఉన్న సమయంలో ఆటగాళ్లలో ధైర్యం నూరిపోశాడు. విజయం సాధించేలా కసి నింపాడు. మెస్సీ, మెరడోనా, పీలేలు లాంటి దిగ్గజాలు ప్రత్యర్థి జట్టులో ఉన్నా భయపడకుండా ఆడాలంటూ గట్టిగా చెప్పుకొచ్చాడు. రెండు నిమిషాల స్పీచ్‌తో ఆటగాళ్లలో విజయ కాంక్ష రగిలింది. కట్ చేస్తే.. మైదానంలో వరుసగా రెండు గోల్స్ చేసి, దిగ్గజ జట్టుకు చుక్కలు చూపించారు.

రెనార్డ్ మాట్లాడుతూ.. ‘డ్రెస్సింగ్ రూంలో కూర్చుని మనం ఏం చేస్తున్నాం. మనం ఏమైనా ప్రెస్ మీట్‌లో ఉన్నామా..? గ్రౌండ్ లో మెస్సీ బాల్‌తో గోల్ చేసేందుకు వస్తున్నాడు. మీరు మాత్రం అతడినే చూస్తుండిపోతున్నారు. మెస్సీని అడ్డుకోవాలని మీకు తెలియదా? అక్కడ మీరు మెస్సీతో సెల్ఫీలు దిగేందుకు వెళ్లారని అనుకుంటే, అదే చేయండి. డిఫెన్స్ చేయాలంటే అటెన్షన్ తప్పకూడదు. ఇది ప్రపంచకప్. ఇక్కడ జరుగుతోంద యుద్దం. మీరు గెలవాలంటే తప్పకుండా పోరాడాలి..’ అంటూ ఆటగాళ్లలో స్ఫూర్తి నింపాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..