Sania Mirza: ఒక ద‌శ‌లో మ‌ళ్లీ టెన్నిస్ ఆడ‌లేనేమో అనుకున్నా.. ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించిన సానియా మీర్జా..

|

May 11, 2021 | 6:33 PM

Sania Mirza About Depression: చాలా మంది శారీర‌క ఆరోగ్యం గురించి మాత్ర‌మే ఆలోచిస్తారు. శ‌రీరానికి ఏ చిన్న గాయ‌మైనా వెంట‌నే వైద్యులను సంప్ర‌దిస్తారు, చికిత్స తీసుకుంటారు. అయితే మాన‌సిక...

Sania Mirza: ఒక ద‌శ‌లో మ‌ళ్లీ టెన్నిస్ ఆడ‌లేనేమో అనుకున్నా.. ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించిన సానియా మీర్జా..
Sania Mirza
Follow us on

Sania Mirza About Depression: చాలా మంది శారీర‌క ఆరోగ్యం గురించి మాత్ర‌మే ఆలోచిస్తారు. శ‌రీరానికి ఏ చిన్న గాయ‌మైనా వెంట‌నే వైద్యులను సంప్ర‌దిస్తారు, చికిత్స తీసుకుంటారు. అయితే మాన‌సిక అనారోగ్యం గురించి ప్ర‌జ‌ల్లో పెద్ద‌గా అవ‌గాహన ఉండ‌దు. సామాన్యుల నుంచి సెల‌బ్రిటీల వ‌ర‌కు ఎవ‌రూ డిప్రెష‌న్‌కు అతీథులు కారు. ఇప్ప‌టికే చాలా మంది సెల‌బ్రిటీలు తాము డిప్రెష‌న్ భారిన ప‌డినట్లు బ‌హిరంగానే ప్ర‌క‌టించారు. తాజాగా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కూడా నోరు విప్పారు. తానూ డిప్రెష‌న్ బాధిత‌రురాలినేనని చెప్పుకొచ్చారు.
ఈ విష‌య‌మై సానియా మాట్లాడుతూ.. తాను చాలా సార్లు మాన‌సిక స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొన్నాని చెప్పుకొచ్చారు. టెన్నిస్ కోర్టు బ‌య‌ట కూడా ఇబ్బందులు ఎదుర్కొన్న‌ట్లు చెప్పిన సానియా.. ‘34 ఏళ్ల వ‌య‌సులో నా ఆలోచ‌న‌లు చాలా స్ప‌ష్టంగా ఉన్నాయి. కానీ 20 ఏళ్ల వ‌య‌సులో మాత్రం అలా ఆలోచించ‌లేదు. నిజాయ‌తీగా చెప్పాలంటే ఆ స‌మ‌యంలో జ‌రిగిన కొన్ని ప‌నుల‌ను నేను చేసి ఉండాల్సంది కాద‌నుకుంటా. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో నా మ‌ణిక‌ట్టుకు పెద్ద గాయ‌మైంది. మ్యాచ్ మ‌ధ్య‌లోనే వైదొల‌గాల్సి రావ‌డంతో చాలా బాధ ప‌డ్డా. ఆ త‌ర్వాత మూడు, నాలుగు నెల‌లు డిప్రెష‌న్‌లోకి వెళ్లా. ఏ కార‌ణం లేకుండా ఏడిచిన సంద‌ర్భాలు నాకు ఇప్ప‌టికీ గుర్తున్నాయి. ఒక నెల రోజుల పాటు గ‌దిలో నుంచి బ‌య‌ట‌కు రాని రోజులు కూడా ఉన్నాయి. ఒక ద‌శ‌లో నేను మ‌ళ్లీ టెన్నిస్ ఆడ‌లేనేమోన‌ని అనుకున్నా.. అనుకున్న‌ది చేయాల‌నే కోరిక నాకు ఎక్కువ.. అలాంటిది కోరుకున్న‌ది జ‌ర‌గ‌క‌పోవ‌డాన్ని జీర్ణించుకోలేక‌పోయేదాన్ని’ అని వాపోయింది సానియా. ఇక ఒలింపిక్స్‌లో చేతికి అయిన గాయం గురించి మాట్లాడుతూ.. ‘చేతి గాయం చాలా ఇబ్బంది పెట్టింది. ఇక‌ సర్జరీ తర్వాత ఇబ్బంది మ‌రింత పెరిగింది. దాంతో, నా ఫ్యామిలీని, నా దేశాన్ని నిరాశ పరిచా అనే భావ‌న నాలో బాగా పెరిగింది. ఆ క‌ష్ట స‌మ‌యంలో నా కుటుబం నాకు అండ‌గా నిలిచింది. న‌న్ను స‌రైన మార్గంలో న‌డింపించింది. ఆ తర్వాత ఇండియాలో జరిగిన కామన్వెల్త్‌‌ గేమ్స్‌‌లో రెండు మెడల్స్‌‌ గెలిచా’ అని త‌న గత జ్ఞాప‌కాల‌ను పంచుకుందీ స్టార్ ప్లేయ‌ర్‌.

Also Read: Selvaraghavan: సెల్వ రాఘ‌వ‌న్, ద‌ళ‌ప‌తి విజ‌య్ కాంబోలో మూవీ..! కానీ ఇక్క‌డే క్రేజీ ట్విస్ట్

శ్రీలంక టూర్‌ కోసం 24 మంది సభ్యులతో జట్టు ఎంపిక.. కానీ పేర్లు వెల్లడించని బీసీసీఐ..

Veda Krishnamurthy: ‘నాలాంటి వారిని త‌లుచుకుంటే గుండె త‌రుక్కుపోతుంది’.. భార‌త క్రికెట‌ర్ బావోద్వేగ‌ పోస్ట్