Russia Ukraine War: క్రీడల్లో ఒంటరైన రష్యా, బెలారస్.. పెరుగుతోన్న ఆంక్షలు..

Russia Ukraine War: క్రీడల్లో ఒంటరైన రష్యా, బెలారస్.. పెరుగుతోన్న ఆంక్షలు..
Russia Ukraine War

Russia Ukraine Crisis: ఉక్రెయిన్‌పై దాడి తర్వాత రష్యా అనేక ఆంక్షలను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ఆ దేశ క్రీడలు, క్రీడాకారులపై తీవ్రఒత్తిడి పెరుగుతోంది.

Venkata Chari

|

Mar 02, 2022 | 9:55 AM

Russia Ukraine Crisis: యూఎస్, దాని మిత్రదేశాలు, ఈయూల ఆగ్రహాన్ని ఎదుర్కొంటున్న రష్యా.. ఉక్రెయిన్‌(Russia Attack on Ukraine)పై తన పంతం మాత్రం తగ్గించుకోకపోవడంతో ఈ దేశాలన్ని పలు రకాల ఆంక్షలు విధించాయి. ఇంధన, ఆర్థిక, సైనిక-పారిశ్రామిక రంగాలపై తీవ్ర ఆంక్షలు విధించాయి. రష్యన్ బ్యాంకులను స్విఫ్ట్ బదిలీ వ్యవస్థను ఉపయోగించకుండా నిరోధించడం నుంచి రష్యన్ సెంట్రల్ బ్యాంక్ ఆస్తులను స్తంభింపజేయడం వరకు ఇలా ఎన్నో రకాల ఆంక్షలను విధించాయి. అధ్యక్షుడు పుతిన్, విదేశాంగ మంత్రి లావ్రోవ్, రక్షణ మంత్రి షోయిగుల విదేశీ ఆస్తులు యూఎస్, ఈయూ, యూకేలలో స్తంభింపజేశారు. అదే సమయంలో, రష్యాకు మద్దతు ఇస్తున్న బెలారస్‌ (Belarus)పై కూడా చర్య తీసుకొనేందుకు సిద్ధమయ్యారు.

అయినప్పటికీ, మరొక రకమైన ఆంక్షల పాలన కూడా అమలులో ఉంది. ఇది ఆర్థిక లేదా పారిశ్రామిక వ్యవస్థను దెబ్బతీయడం మాత్రమే కాదు. పాశ్చాత్య దేశాలు యుద్ధంలో మరోరకంగా దెబ్బతీసేందుకు ప్లాన్ చేశాయి. అదే క్రీడలపై(Russia Sports sanctions) ఆంక్షలు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఉక్రెయిన్ యుద్ధంలో రాజకీయంగా ప్రవేశించింది. రష్యా, బెలారస్ నుంచి అథ్లెట్లు, అధికారులు అంతర్జాతీయ క్రీడా కార్యక్రమాల నుంచి నిషేధించాలంటూ సలహా ఇచ్చారు.

ఉక్రెయిన్‌పై దాడి తర్వాత, క్రీడల్లో రష్యాపై ఆంక్షలు కూడా పెరుగుతున్నాయి. మార్చి 1 న, వివిధ క్రీడల ప్రపంచ సంస్థలు రష్యాను సస్పెండ్ చేయాలని నిర్ణయించాయి. దీంతో పాటు రష్యాకు ఆతిథ్యమివ్వాల్సిన టోర్నీలు కూడా ఉపసంహరించుకున్నాయి. అయితే, జాతీయ జెండా, జాతీయ గీతం లేకుండా వ్యక్తిగత ఈవెంట్‌లలో ఆడేందుకు రష్యా ఆటగాళ్లను అనుమతించారు. దీనితో పాటు, చాలా పెద్ద బ్రాండ్లు కూడా రష్యాకు దూరమయ్యాయి. జట్లు కూడా రష్యన్ కంపెనీలకు దూరంగా ఉన్నాయి. ఫుట్‌బాల్, టెన్నిస్, సైక్లింగ్, ఫార్ములా వన్, అథ్లెటిక్స్, షూటింగ్, బ్యాడ్మింటన్, హాకీలను నిర్వహించే సంస్థలు ఇప్పటివరకు రష్యాపై నిషేధం విధించాయి.

అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య రష్యా, బెలారస్‌లను ప్రధాన టెన్నిస్ టోర్నమెంట్‌ల నుంచి సస్పెండ్ చేయాలని నిర్ణయించింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి తర్వాత ఈ చర్య తీసుకున్నారు. అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య మార్చి 1న రష్యా, బెలారస్‌లను డేవిస్ కప్, బిల్లీ జీన్ కింగ్ కప్ నుంచి సస్పెండ్ చేసినట్లు నివేదించింది. దీంతో పాటు ఈ రెండు దేశాల ఐటీఎఫ్ సభ్యత్వాన్ని కూడా తక్షణమే నిలిపివేశారు. 2022 అక్టోబర్‌లో మాస్కోలో జరగాల్సిన మహిళల, పురుషుల టెన్నిస్ టోర్నమెంట్‌లు కూడా నిలిపేశారు. రష్యా, బెలారస్ నుంచి వచ్చిన ఆటగాళ్ళు గ్రాండ్ స్లామ్, ఇతర సారూప్య టోర్నమెంట్లలో పాల్గొనగలిగినప్పటికీ, వారు రష్యా, బెలారస్ జెండాలు లేదా పేర్లను ఉపయోగించలేరు. డానియల్ మెద్వెదేవ్ నంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్‌గా మారిన తరుణంలో ఐటీఎఫ్ ఈ నిర్ణయం తీసుకుంది. వారు రష్యా నుంచి వచ్చిన సంగతి తెలిసిందే.

ఫార్ములా వన్ కూడా ఆంక్షలు విధించింది.. అదేవిధంగా, ఫార్ములా వన్ రేసుల్లో రష్యా జెండా, జాతీయ గీతాన్ని కూడా నిషేధించారు. ఎఫ్‌ఐఏ మంగళవారం ఈ నిర్ణయం తీసుకుంది. అంతకుముందు రష్యాలో జరగాల్సిన గ్రాండ్ ప్రిని కూడా రద్దు చేసింది. రష్యా, బెలారస్ నుంచి డ్రైవర్లు రేసులో పాల్గొనగలిగినప్పటికీ, వారు FIA జెండాతో మాత్రమే ఇందులో పాల్గొనగలదరు. అలాగే ఫార్ములా వన్ రేస్‌లో రష్యా నుంచి ఒకే ఒక్క డ్రైవర్ ఉన్నాడు. అతని పేరు నికితా మెజ్పిన్. అమెరికన్ టీమ్ హాస్ రష్యన్ టైటిల్ స్పాన్సర్ నుంచి దూరంగా ఉంది.

సైక్లింగ్ జట్టును కూడా నిషేధించారు.. రష్యా, బెలారస్ నుంచి సైక్లింగ్ జట్లు కూడా అంతర్జాతీయ టోర్నమెంట్‌లో పాల్గొనకుండా నిషేధించారు. సైక్లింగ్ గ్లోబల్ బాడీ UCI మార్చి 1న ఈ ప్రకటన చేసింది. రష్యా, బెలారస్ జాతీయ జట్టు ఏ అంతర్జాతీయ ఈవెంట్‌లోనూ పాల్గొనడానికి అనుమతించబడదని పేర్కొంది. అయితే, ఆటగాళ్లు వ్యక్తిగత ఈవెంట్లలో ఆడవచ్చు.

దీంతో పాటు షూటింగ్, అథ్లెటిక్స్‌కు సంబంధించిన సంస్థలు కూడా రష్యాపై చర్యలు తీసుకున్నాయి. రష్యా జట్లను కూడా పాల్గొనకుండా నిషేధించారు. దీనితో పాటు, రష్యా జెండా, జాతీయ గీతం కూడా నిషేధించారు.

Also Read: 72 గంటల పాటు ఏకధాటిగా బ్యాటింగ్.. ప్రపంచ రికార్డు సృష్టించిన 19 ఏళ్ల భారత క్రికెటర్..

Rohit Sharma Lamborghini: ఖరీదైన కారు కొన్న టీమిండియా సారథి.. ధర తెలిస్తే షాకవ్వాల్సిందే..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu