Serena Williams Retires: టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించనున్న లేడీ లెజెండ్.. ఇన్‌స్టాలో ప్రకటన.. ఎప్పుడంటే?

|

Aug 10, 2022 | 5:04 AM

టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ టెన్నిస్ ప్రపంచానికి రిటైర్మెంట్ ప్రకటించబోతోంది. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది.

Serena Williams Retires: టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించనున్న లేడీ లెజెండ్.. ఇన్‌స్టాలో ప్రకటన.. ఎప్పుడంటే?
Serena Williams Retires
Follow us on

Serena Williams Retires: అమెరికా గ్రేట్ టెన్నిస్ ప్లేయర్, ప్రపంచవ్యాప్తంగా టెన్నిస్ ద్వారా తన సత్తా ఏంటో నిరూపించుకున్న సెరెనా విలియమ్స్.. తాజాగా రిటైర్మెంట్ ప్రకటించింది. వోగ్ సెప్టెంబర్ సంచిక కవర్‌పై కనిపించిన తర్వాత, 40 ఏళ్ల టెన్నిస్ దిగ్గజం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘జీవితంలో మనం వేరే దిశలో వెళ్లాలని నిర్ణయించుకోవాల్సిన సమయం వస్తుంది. మీరు దేనినైనా ఎక్కువగా ప్రేమిస్తున్నప్పుడు ఆ సమయాలు ఎల్లప్పుడూ కఠినంగా ఉంటాయి. టెన్నిస్‌ని ఆస్వాదించడం నా గొప్పతనం. అయితే ఇప్పుడు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది’ అంటూ చెప్పుకొచ్చింది.

ఇన్‌స్టాలో ప్రకటన..

ఇవి కూడా చదవండి

‘నేను తల్లిగా ఉండటంపై, నా ఆధ్యాత్మిక లక్ష్యాలపై దృష్టి పెట్టాలి. చివరకు భిన్నమైన, కానీ అంతే ఉత్తేజకరమైనదాన్ని కనుగొనడంపై దృష్టి పెట్టాలి. రాబోయే కొన్ని వారాలు నేను ఆనందించబోతున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది.

యూఎస్ ఓపెన్ టైటిల్‌లో సత్తా..

మహిళల టెన్నిస్ గ్రేట్ సెరెనా విలియమ్స్ యూఎస్ ఓపెన్‌లో అద్భుత ప్రదర్శన చేస్తూ తన కెరీర్‌లో మొత్తం 6 సార్లు ఈ టైటిల్‌ను గెలుచుకుంది. ఆమె 1999, 2002, 2008, 2012, 2013, 2014 సంవత్సరాల్లో US ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. అదే సమయంలో, ఆమె 23 సార్లు గ్రాండ్‌స్లామ్ విజేతగా కూడా నిలిచింది. అయితే కొంతకాలంగా గాయాలతో బాధపడుతున్న ఆమె టెన్నిస్‌ కోర్టులో ఫామ్‌ కూడా ఆమెకు సహకరించడం లేదు. పేలవమైన ఫామ్ కారణంగా ఆమె రిటైర్మెంట్ గురించి చాలా కాలంగా వార్తల్లో నిలిచింది.