karate player Hardeep: ప్రోత్సాహం ఇవ్వని ప్రభుత్వం జీవనం కోసం కూలీగా మారిన అంతర్జాతీయ అథ్లెట్

|

Jun 11, 2021 | 1:37 PM

 karate player Hardeep : నూరు కోట్లకు పైగా జనాభా ప్రపంచంలో రెండో స్థానం.. అయితే అంతర్జాతీయ వేదికపై క్రీడా రంగంలో మన స్థానం ఎక్కడ అంటే వేదకాల్సిందే..

karate player Hardeep: ప్రోత్సాహం ఇవ్వని ప్రభుత్వం జీవనం కోసం కూలీగా మారిన అంతర్జాతీయ అథ్లెట్
Karate Player
Follow us on

karate player Hardeep : నూరు కోట్లకు పైగా జనాభా ప్రపంచంలో రెండో స్థానం.. అయితే అంతర్జాతీయ వేదికపై క్రీడా రంగంలో మన స్థానం ఎక్కడ అంటే వేదకాల్సిందే.. ఒలంపిక్స్ వంటి అంతర్జాతీయ క్రీడల్లో భారత దేశ పతాకం రెపరెపలాడేది అతి తక్కువనే చెప్పవచ్చు. ఒకటి రెండో పసిడి పతకాలు వస్తే.. దేశంలో పండగే.. అయితే దేశంలో క్రీడాకారులకు కొదవు లేదా.. అంటే ఉంది. కానీ క్రికెట్ వంటి క్రీడకు ఇచ్చే విలువ మరే క్రీడలకు లేదు.. వాటికీ ప్రభుత్వం తల్లిదండ్రులు ఇచ్చినంత ప్రోత్సాహం మిగతా క్రీడలకు, క్రీడాకారులకు ఇవ్వడం లేదు.. అందుకనే ఎందరో ప్రతిభావంతులు మట్టిలో మాణిక్యాలుగా మిగిలిపోతున్నారు. కొంతమంది కష్టపడి తమకంటూ గుర్తింపు తెచ్చుకున్నా.. సరైన ప్రోత్సాహం ఆర్ధిక వనరు లేక కూలీలుగా మారిపోతున్నారు. తాజాగా జాతీయ, అంతర్జాతీయ కరాటే పోటీల్లో పదునైన పంచ్‌లతో పతకాలు కొల్లగొట్టిన హర్దీప్‌ కౌర్‌ ఇప్పుడు కూలీగా మారింది. పొట్టగడవం కోసం పొలం బాట పట్టింది.

పంజాబ్‌లోని మన్సా జిల్లా గుర్నేకాలాన్‌కు చెందిన 23 ఏండ్ల హర్దీప్‌ కుటుంబాన్ని పోషించేందుకు రోజు కూలీగా మారింది. రోజుకు రూ.300 సంపాదన కోసం పొలాల్లో పని చేస్తుంది. ఇప్పటి వరకూ జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో దాదాపు 20 పతకాలు సాధించింది. ప్రస్తుతం ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌లో పీజీ చేస్తున్న హర్దీప్‌తో పాటు ఆమె తల్లిదండ్రులు కూడా కూలీలుగా పని చేస్తున్నారు. 2018లో మలేషియాలో జరిగిన పోటీల్లో స్వర్ణం సాధించిన హర్దీప్‌కు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని అప్పటి పంజాబ్‌ క్రీడామంత్రి రాణా గుర్మీత్‌ హామీ ఇచ్చారు. అయితే ఆ హామీ ఇప్పటి వరకూ అమలు లోకి రాలేదు. ఉద్యోగం కోసం హర్దీప్ ఎన్ని సార్లు ప్రభుత్వం వద్దకు వెళ్లినా పని జరగలేదు.. దీంతో కుటుంబ పోషణ కోసం దినసరి కూలీగా పొలంలో పని చేసే పరిస్థితి ఏర్పడింది. అయితే తాను ఎప్పుడూ ఊహించలేదంటూ హర్దీప్‌ కన్నీళ్లు పెట్టుకుంది. ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారేమో అని ఎదురు చూస్తుంది.

Also Read: 2 అక్షరాల సీఎం 2 కాళ్ళ కుర్చీ కంటే.. 4 అక్షరాల మెగాస్టార్ అనే సింహాసనం ఎక్కువ అంటున్న డైరెక్టర్ దేవి