PM Narendra Modi: డబ్ల్యూఏవైసీలో 15 పతకాలతో సత్తా చాటిన భారత ఆర్చరీ బృందం.. శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ

|

Aug 16, 2021 | 10:08 AM

ప్రపంచ ఆర్చరీ యూత్ ఛాంపియన్‌షిప్‌లో 15 పతకాలు సాధించిన భారత బృందాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రశంసించారు.

PM Narendra Modi: డబ్ల్యూఏవైసీలో 15 పతకాలతో సత్తా చాటిన భారత ఆర్చరీ బృందం.. శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ
Indian Archery Team At World Archery Youth Championship
Follow us on

PM Narendra Modi: ప్రపంచ ఆర్చరీ యూత్ ఛాంపియన్‌షిప్‌లో 15 పతకాలు సాధించిన భారత బృందాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రశంసించారు. ఈమేరకు ప్రధాని ట్విట్టర్లో ఓ ట్వీట్ చేశారు. ప్రజలను గర్వపడేలా చేశారంటూ అభింనందించారు. కాగా, 2021 ప్రపంచ ఆర్చరీ యూత్ ఛాంపియన్‌షిప్‌లు పోలాండ్‌లోని వ్రోక్లాలో జరిగాయి. అలాగే ప్రపంచ యూత్‌ ఆర్చరీ చాంపియన్‌షిప్‌ రికర్వ్‌ విభాగంలోనూ భారత ఆర్చర్లు పతకాల పంట పండించారు. ఆదివారం ముగిసిన ఈ మెగా ఈవెంట్‌లో చివరి రోజు భారత ఆర్చర్లు 5 బంగారు పతకాలు, 3 కాంస్య పతకాలతో కలిపి మొత్తం 8 పతకాలు సాధించారు. అండర్‌–21 జూనియర్‌ మహిళల వ్యక్తిగత ఫైనల్లో కోమలిక బారి 7–3తో 2018 యూత్‌ ఒలింపిక్స్‌ చాంపియన్‌ ఇలియా కెనాలెస్‌ (స్పెయిన్‌)పై గెలిచి స్వర్ణ పతకాన్ని సాధించింది.

ప్రధాని మోడీ ట్వీట్‌లో.. “పోలాండ్‌లోని వ్రోక్లాలో జరిగిన ఆర్చరీ యూత్ ఛాంపియన్‌షిప్‌లో భారత బృందం 8 స్వర్ణాలతో సహా 15 పతకాలు సాధించడం మాకు గర్వంగా ఉంది. భారత బృందానికి అభినందనలు. వారి భవిష్యత్తులో మరింతగా రాణించాలి. ఈ విజయం మరింత మంది యువకులకు విలువిద్యలో రాణించేందుకు స్ఫూర్తినిస్తుందని” పెర్కొన్నారు.

Also Read:

Anurag Thakur: ‘2024 ఒలింపిక్ పతక విజేతలతో పోడియం నిండి పోవాలి.. మరింత విస్తృతంగా టాప్స్’: అనురాగ్ ఠాకూర్

11 సిక్సర్లు, 9 ఫోర్లతో 20 బంతుల్లో 102 పరుగులు.. మాజీ ఆర్‌సీబీ ప్లేయర్ విధ్వసకర ఇన్నింగ్స్.. ఎవరో తెలుసా?

Virat Kohli Viral Photo: లార్డ్స్‌లో కోహ్లీ నాగినీ డ్యాన్స్.. దాదాను గుర్తు చేసుకుంటోన్న ఫ్యాన్స్..! వైరలవుతోన్న ఫొటో