Pro Kabaddi 2021: కబడ్డీ.. భారత సాంప్రదాయ క్రీడల్లో ఒకటి. పల్లెల్లో సర్వసాధారణంగా కనిపించే ఈ ఆట మనకు ప్రపంచ ఖ్యాతిని తీసుకొచ్చింది. అయితే అన్ని క్రీడలు తమ ప్రభావాన్ని కోల్పోయినట్లు.. కబడీ కూడా కోల్పోయింది. అయితే కబడికి వాణిజ్య హంగులు అడ్డుకుని ఆదరణ సొంతం చేసుకుంది.. ప్రో కబాడీ లీగ్ గా క్రీడాభిమానులను అలరిస్తుంది. కరోనా నేపథ్యంలో గత ఏడాది నుంచి బ్రేక్ రాగా.. తాజాగా మళ్ళీ పట్టాలెక్కడానికి రంగం సిద్ధం చేసుకుంటుంది ప్రో కబడ్డీ లీగ్. సీజన్ 8 సమరానికి రంగం సిద్ధమవుతోంది. 2014లో 8 జట్లతో ప్రారంభమైన పీకేఎల్ ప్రేక్షకాదరణతో అంచెలంచెలుగా ఎదిగి మరో 4 జట్ల చేరికతో బిగ్ లీగ్‌గా అవతరించింది. ఐపీఎల్ తరహాలోనే అభిమానగణాన్ని సంపాదించుకుంది. కబడ్డీ ఆటగాళ్లపై కనకవర్షం కురిపిస్తోంది.
ఎంతగా ఈ కబాడీ లీగ్ ఆదరణ సొంతం చేసుకుందంటే.. పీకేఎల్ ఏడో సీజన్ వేలంలో ఫ్రాంచైజీలు సుమారు 200 మంది ఆటగాళ్ల కోసం రూ. 50 కోట్లు ఖర్చు చేశాయి. ఈ లీగ్ లో విదేశీ ఆటగాళ్లు కూడా పాల్గొంటూ అదనపు ఆకర్షణగా నిలుస్తున్నారు. సుమారు రెండేళ్ల బ్రేక్ తర్వాత మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నా పీకేఎల్ సీజన్ 8 వేలం ఆగస్టు నెలాఖరున జరగడానికి రెడీ అవుతుంది. ఈ మేరకు సీజన్ 8 వేలానికి సంబంధించిన నిబంధనలు, టైమ్, రూల్స్, ఫ్రాంచైజీల సాలరీ పర్స్, ప్లేయర్ రిటెన్షన్ వివరాలు తెలుసుకుందాం.
ముంబై వేదికగా ఈ నెల 29, 30, 31 తేదీల్లో జరగనుంది. ఈ వేలంలో 500 మందికి పైగా ఆటగాళ్లు పాల్గొననున్నారు. పీకేఎల్ సీజన్ 6, 7 తోపాటు అమెచ్చూర్ కబడ్డి ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఏకేఎప్‌ఐ) సమక్షంలో జరగిన కబడ్డి చాంపియన్‌షిప్స్ 2020, 2021 టోర్నీల్లో పాల్గొన్న ఆటగాళ్లు ఈ వేలంలో పాల్గొననున్నారు. సీజన్-8లో ప్రతీ ఫ్రాంచైజీ దగ్గర రూ.4.4 కోట్ల పర్స్ ఉంటుంది.
ఈ సీజన్ లో జరిగే వేలం పాటలో డొమెస్టిక్, ఓవర్‌సీస్, న్యూ యంగ్ ప్లేయర్స్‌తో ఏబీసీడీ నాలుగు కేటగిరీలుగా విభజించనున్నారు. మళ్లీ అందులో ఆల్‌రౌండర్స్, డిఫెండర్స్, రైడర్స్‌గా సబ్ డివైడ్ చేయనున్నారు. కేటగిరి-ఏ ఆటగాళ్లకు రూ.30 లక్షలు, కేటగిరి -బి-రూ.20 లక్షలు, కేటగిరి సీ-రూ. 10 లక్షలు, కేటగిరి డీ-రూ.6 లక్షలు బేస్ ప్రైజ్‌గా నిర్ణయించారు.
అయితే ప్రతి టీమ్ ఆరుగురు సీనియర్ ఆటగాళ్లతో పాటు మరో ఆరుగురు యువ ఆటగాళ్లను రిటైన్ చేసుకునే అవకాశం ఉంది. మిగతా వారు వేలం లోకి వస్తారు. ప్రభుత్వ నిబంధనలను అనుసరించి ఈ టోర్నీ నిర్వహించడానికి నిర్వాహకులు రంగం సిద్ధం చేస్తున్నారు, ఈ ఏడాది చివరలో డిసెంబర్ 2021లో సీజన్ 8 జరిగే అవకాశం ఉంది.
తెలుగు టైటాన్స్, బెంగాల్ వారియర్స్, బెంగళూరు బుల్స్, దంబంగ్ ఢిల్లీ, జైపు పింక్ పాంథర్స్, గుజరాత్ ఫార్చూనైట్స్, తమిళ్ వారియర్స్, యూ ముంబా, హర్యానా స్టీలర్స్, యూపీ యోధా, పాట్నా పైరెట్స్, పుణేరి పల్టాన్
Also Read: Urban Gardening: సోషల్ మీడియా ద్వారా నేర్చుకున్న గార్డెనింగ్.. డాబాపై 200 రకాల మొక్కలను పెంచుతున్న వైనం