Wimbledon 2021: మహిళల సింగిల్స్‌లో కొత్త ఛాంపియన్‌కే అవకాశం.. ఫైనల్ చేరిన ఆష్లే బార్టీ, ప్లిస్కోవా!

|

Jul 09, 2021 | 7:12 AM

వింబుల్డన్‌లో పోటీలు చివరి దశకు చేరుకుంటున్నాయి. మహిళల సింగిల్స్ లో టాప్‌ సీడ్‌ ఆస్ట్రేలియా ప్లేయర్ ఆష్లే బార్టీ, ఎనిమిదో సీడ్‌ చెక్ ప్లేయర్ ప్లిస్కోవా సెమీస్‌లో విజయం సాధించి, ఫైనల్‌కు చేరుకున్నారు.

Wimbledon 2021:  మహిళల సింగిల్స్‌లో కొత్త ఛాంపియన్‌కే అవకాశం.. ఫైనల్ చేరిన ఆష్లే బార్టీ, ప్లిస్కోవా!
Wimbledon 2021 Final Womens
Follow us on

Wimbledon 2021: వింబుల్డన్‌లో పోటీలు చివరి దశకు చేరుకుంటున్నాయి. మహిళల సింగిల్స్ లో టాప్‌ సీడ్‌ ఆస్ట్రేలియా ప్లేయర్ ఆష్లే బార్టీ, ఎనిమిదో సీడ్‌ చెక్ ప్లేయర్ ప్లిస్కోవా సెమీస్‌లో విజయం సాధించి, ఫైనల్‌కు చేరుకున్నారు. ఈమేరకు బార్టీ సెమీఫైనల్లో 6-3, 7-6 (7-3)తో మాజీ ఛాంపియన్‌ జర్మనీ ప్లేయర్ కెర్బర్‌ పై గెలిచింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో మ్యాచ్‌లో బార్టీ 8 ఏస్‌లు, 38 విన్నర్లు కొట్టగా, కెర్బర్‌ 23 తప్పిదాలు చేయడంతో.. బార్టీ విజయం సాధించింది. తొలి సెట్‌లో 6-3తో గెలుచుకున్న బార్టీ.. రెండో సెట్ లో చాలా కష్టపడింది. ఇక రెండో సెట్‌లో 5-5తో సమం చేసుకోగా, మ్యాచ్ టై బ్రేక్‌కు దారి తీసింది. టై బ్రేక్‌లో బార్టీ ఆధిపత్యం చూపించింది. టాప్ సీడ్ బార్టీ తొలిసారిగా ఫైనల్‌ చేరింది. తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ కోసం ఎదురుచూస్తున్న ప్లిస్కోవాకు కూడా ఇదే మొదటి వింబుల్డన్‌ ఫైనల్‌ కావడం విశేషం. దీంతో ఈసారి వింబుల్డన్‌లో సరికొత్త చాంపియన్‌ అవతరించనుంది.

మరో సెమీస్‌లో ప్లిస్కోవా 5-7, 6-4, 6-4తో రెండో సీడ్‌ బెలారస్ ప్లేయర్ సబలెంక ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో మొత్తం 31 ఏస్‌లు నమోదవ్వగా… పదునైన సర్వీసులు చేసిన ప్లిస్కోవా మ్యాచ్‌లో 14 ఏస్‌లు సంధించింది. సబలెంక 18 ఏస్‌లు కొట్టింది. గంటా 53 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో తొలి సెట్‌ హోరాహోరీగా సాగింది. మహిళల ఫైనల్‌ శనివారం జరగనుంది. శుక్రవారం జరిగే పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్స్‌లో షపొవలోవ్‌తో జకోవిచ్‌, హర్కజ్‌తో బెరెటిని తలపడతారు.

Also Read:

బౌలర్ అవతారం ఎత్తిన బ్యాట్స్‌మెన్.. మొదటి టెస్టులో 6 వికెట్లు తీసినా గంగూలీకి నచ్చలేదు.. 3 టెస్టులు, 5 వన్డేలతో రిటైర్మెంట్..!

278 బంతులు.. 37 పరుగులు.. మరో రాహుల్ ద్రవిడ్ ఈ బ్యాట్స్‌మెన్..! అతడెవరంటే..?