Nethra Kumanan: సెయిలర్ నేత్ర సరికొత్త ఘనత..తొలి మహిళ క్రీడాకారిణిగా రికార్డ్..
సెయిలర్ నేత్ర సరికొత్త ఘనత సాధించింది. ఒలింపిక్స్‌లో సెయిలింగ్‌లో పోటీపడనున్న తొలి మహిళ క్రీడాకారిణిగా నిలిచింది. ఒలింపిక్స్ అర్హత సాధించిన తొలి మహిళ సెయిలర్‌గా నేత్రా కుమనన్ చరిత్ర సృష్టించింది. ఒమన్‌లో జరుగుతున్న..
Indian sailor: సెయిలర్ నేత్ర సరికొత్త ఘనత సాధించింది. ఒలింపిక్స్‌లో సెయిలింగ్‌లో పోటీపడనున్న తొలి మహిళ క్రీడాకారిణిగా నిలిచింది. ఒలింపిక్స్ అర్హత సాధించిన తొలి మహిళ సెయిలర్‌గా నేత్రా కుమనన్ చరిత్ర సృష్టించింది. ఒమన్‌లో జరుగుతున్న ఆసియా క్వాలిఫయర్స్‌లోని లేజర్ రేడియల్ క్లాస్ ఈవెంట్లో పోటీ పడిన నేత్ర.. బుధవారం పోటీల్లో 21 పాయింట్లతో టాప్‌లో నిలిచింది.
దీంతో తుది ఫలితాలతో సంబంధం లేకుండా నేరుగా ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. నేత్రాతో పాటు మన దేశం నుంచి మరో ముగ్గురు, సెయిలింగ్ పోటీల కోసం ఒలింపిక్స్‌కు వెళ్లనున్నారు. వీరిలో విష్ణు శరవణన్, గణపతి చెంగప్ప-వరుణ్ తక్కర్ జోడీ ఉన్నారు. ఇప్పటివరకు సెయిలింగ్‌లో ఒలింపిక్స్‌కు ప్రాతినిధ్యం వహించిన వారిలో తొమ్మిది మంది పురుషులు కాగా… మెగా క్రీడల్లో పాల్గొనున్న తొలి మహిళ సెయిలర్‌గా నేత్ర సరికొత్త రికార్డులను సృష్టించారు. కరోనా ప్రభావంతో గతేడాది జరగాల్సిన ఒలింపిక్స్‌ను.. సంవత్సరం వాయిదా వేసింది. దీంతో ఈ ఏడాది జులై 23 నుంచి ఆగస్టు 8 వరకు టోక్యోలో పోటీలు జరగనున్నాయి.
ఆగష్టు 21, 1997 న జన్మించిన నేత్రా 2011 లో తమిళనాడు సెయిలింగ్ అసోసియేషన్ నిర్వహించిన వేసవి శిబిరంలో తొలి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నేత్ర క్రీడా ప్రయాణం కొనసాగుతోంది. ఇది త్వరలోనే ఆమె జీవితంలో ఒక భాగంగా మారిపోయింది.
చెన్నైలోని ఎస్‌ఆర్‌ఎం కాలేజీలో ఇంజనీరింగ్ విద్యార్థిగా ఉన్న నేత్రా రెండుసార్లు జాతీయ ఛాంపియన్‌షిప్‌లు గెలుచుకుంది. మరో రెండు సందర్భాలలో రన్నరప్‌గా నిలిచింది.