Neeraj Chopra: గోల్డెన్ బాయ్‌పైనే ‘పసిడి’ ఆశలు.. ఒక్క అడుగు దూరంలో..

|

Aug 08, 2024 | 1:08 PM

యావత్‌ భారతావని ఆశలు మోస్తూ... ఫైనల్‌ బరిలో దిగుతున్నాడు నీరజ్‌చోప్రా. వరుసగా రెండోసారి పసిడి పతకమే లక్ష్యంగా పారిస్‌లో అడుగు పెట్టిన నీరజ్‌.. క్వాలిఫైయర్‌ రౌండ్‌లో ఒకే ఒక్క త్రోతో అందరి దృష్టిని ఆకర్షించాడు.

Neeraj Chopra: గోల్డెన్ బాయ్‌పైనే పసిడి ఆశలు.. ఒక్క అడుగు దూరంలో..
Paris Olympics 2024 Neeraj
Follow us on

యావత్‌ భారతావని ఆశలు మోస్తూ… ఫైనల్‌ బరిలో దిగుతున్నాడు నీరజ్‌చోప్రా. వరుసగా రెండోసారి పసిడి పతకమే లక్ష్యంగా పారిస్‌లో అడుగు పెట్టిన నీరజ్‌.. క్వాలిఫైయర్‌ రౌండ్‌లో ఒకే ఒక్క త్రోతో అందరి దృష్టిని ఆకర్షించాడు. టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణంతో చరిత్ర సృష్టించిన నీరజ్‌.. పారిస్‌లోనూ పసిడి గెలవాలని దేశం మొత్తం కోరుకుంతోంది. ఈ రోజు రాత్రి జరగనున్న ఫైనల్లో నీరజ్ బంగారు పతకం సాధించాలని యావత్‌ దేశం వేయి కళ్లతో ఎదురు చూస్తోంది.

ఇప్పుడు భారతీయుల ఆశలన్నీ ఇప్పుడు స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాపైనే ఉన్నాయి. క్వాలిఫై పోటీలో నీరజ్ ఈ సీజన్‌లో అత్యుత్తమ త్రో చేశాడు. తన మొదటి ప్రయత్నంలోనే 89.34 మీటర్ల త్రోతో క్వాలిఫికేషన్ పట్టికలో ఫస్ట్‌ ప్లేస్‌లో నిలిచాడు. రాత్రి జరిగే ఫైనల్‌ మ్యాచ్‌లోనూ నీరజ్‌చోప్రా వరుసగా రెండో స్వర్ణం గెలవాలని భారతీయులంతా కోరుకుంటున్నారు.

మరోసారి నీరజ్‌ దేశానికి పసిడి అందించగలడనే అంచనాలు భారీగా ఉన్నాయి. ఇదే జరిగితే ఒలింపిక్స్‌ చరిత్రలో జావెలిన్‌ త్రో టైటిల్‌ నిలబెట్టుకొన్న ఐదో ఆటగాడిగా.. రెండు ఒలింపిక్‌ స్వర్ణాలు సాధించిన తొలి భారత అథ్లెట్‌గా నీరజ్‌ సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తాడు. అంతేకాక వరుసగా రెండుసార్లు జావెలిన్‌ త్రో పసిడి నెగ్గిన జాన్‌ జెలెజ్నీ లాంటి దిగ్గజాల సరసన నిలుస్తాడు.

ఇది చదవండి: వీళ్లది అట్లాంటి.. ఇట్లాంటి యాపారం కాదు.. అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాంక్

 

మరిన్ని ఒలింపిక్స్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..