Neeraj Chopra: ‘నీ ప్రతిభ అసమానం.. క్రీడా ప్రపంచానికే ఓ చిహ్నం’: నీరజ్‌పై ప్రధాని ప్రశంసల జల్లు..

PM Narendra Modi: భారత ప్రధాని నరేంద్ర మోడీ గోల్డెన్ బాయ్ నీరజ్‌కు అభినందనలు తెలుపుతూ, ఓ ట్వీట్ చేశారు. ' నీరజ్ ప్రతిభ ఎనలేనిది. అతని అంకితభావం, ఏకాగ్రత, అభిరుచితో అథ్లెటిక్స్‌లో ఛాంపియన్‌గా మాత్రమే కాకుండా.. మొత్తం క్రీడా ప్రపంచంలో అసమానమైన నైపుణ్యానికి చిహ్నంగా మార్చాయి. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించినందుకు అభినందనలు' అంటూ ట్వీట్ చేశాడు.

Neeraj Chopra: 'నీ ప్రతిభ అసమానం.. క్రీడా ప్రపంచానికే ఓ చిహ్నం': నీరజ్‌పై ప్రధాని ప్రశంసల జల్లు..
Pm Modi Neeraj Chopra
Follow us
Venkata Chari

|

Updated on: Aug 28, 2023 | 8:27 AM

Neeraj Chopra: భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఆదివారం రాత్రి చరిత్ర సృష్టించాడు. బుడాపెస్ట్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించి, సరికొత్త చరిత్ర నెలకొల్పాడు. దీంతో నీరజ్ తన ట్రోఫీల ఖాతాలో మరో లోటును కూడా పూర్తి చేశాడు. టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ స్వర్ణ పతకం సాధించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత అతను డైమండ్ లీగ్‌లోనూ ఛాంపియన్‌గా నిలిచాడు. ఈ క్రమంలో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకంతోపాటు వరుసగా 23 పతకాలను తన ఖాతాలో జమ చేసుకున్నాడు. నీరజ్ నిరంతరం తన ఖాతాలో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసుకుంటూ పోతున్నాడు.

ప్రధాని ప్రశంసలు..

ఈ క్రమంలో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన నీరజ్ చోప్రాపై ప్రశంసల జల్లు కురుస్తోంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ గోల్డెన్ బాయ్ నీరజ్‌కు అభినందనలు తెలుపుతూ, ఓ ట్వీట్ చేశారు. ‘ నీరజ్ ప్రతిభ ఎనలేనిది. అతని అంకితభావం, ఏకాగ్రత, అభిరుచితో అథ్లెటిక్స్‌లో ఛాంపియన్‌గా మాత్రమే కాకుండా.. మొత్తం క్రీడా ప్రపంచంలో అసమానమైన నైపుణ్యానికి చిహ్నంగా మార్చాయి. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించినందుకు అభినందనలు’ అంటూ ట్వీట్ చేశాడు.

ఇవి కూడా చదవండి

పీఎం నరేంద్ర మోడీ ట్వీట్..

88.17 మీటర్లతో బంగారు పతకం..

ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో నీరజ్ చోప్రా 88.17 మీటర్ల బెస్ట్ త్రో విసిరి టైటిల్ గెలుచుకున్నాడు. ఈ బంగారు పతకంతో చరిత్ర సృష్టించాడు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌తోపాటు ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన రెండవ భారత ఆటగాడిగా నిలిచాడు. అతని కంటే ముందు అభినవ్ బింద్రా పతకం సాధించాడు.

భారత్, పాకిస్తాన్ ప్లేయర్ల జావెలీన్ త్రో వివరాలు..

బంగారం అందించిన రికార్డ్ త్రో..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..