Canada Open 2023: కెనడా ఓపెన్ గెలిచిన లక్ష్య సేన్.. సెల్యూట్ చేసిన క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్..

Lakshya Sen win Canada Open 2023: ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ లి షి ఫెంగ్‌ను వరుస గేమ్‌లలో ఓడించి లక్ష్య సేన్ కెనడా ఓపెన్‌ని కైవసం చేసుకున్నాడు. ఇది అతనికి రెండో WBF సూపర్ 500 టైటిల్.

Canada Open 2023: కెనడా ఓపెన్ గెలిచిన లక్ష్య సేన్.. సెల్యూట్ చేసిన క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్..
Lakshya Sen
Follow us
Venkata Chari

|

Updated on: Jul 10, 2023 | 3:34 PM

వయసు చిన్నదే.. కానీ చేసిన అద్భుత చాలా పెద్దది. తొలుత పరాజయం పాలైనప్పటికీ ఉద్దేశ్యాన్ని వదులుకోలేదు. తన సంచిలో మరో టైటిల్ పెట్టాలనే ఉద్దేశ్యంతో బరిలోకి దిగాడు. మళ్లీ భారత పతాకాన్ని ఎగురవేయాలనే కసితో దూసుకెళ్లాడు. 21 ఏళ్ల లక్ష్య సేన్ ఇదే చేశాడు. అతను ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ లీ షి ఫెంగ్‌ను వరుస గేమ్‌లలో ఓడించి కెనడా ఓపెన్‌ని కైవసం చేసుకున్నాడు. ఇది అతనికి రెండో WBF సూపర్ 500 టైటిల్. క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా లక్ష్య సేన్ సాధించిన ఈ విజయానికి సెల్యూట్ చేశారు.

ఫెంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత షట్లర్ లక్ష్య సేన్ వరుస గేమ్‌లలో విజయం సాధించాడు. తొలి గేమ్‌ను 21-18తో చేజార్చుకున్న అతను.. రెండో గేమ్‌లో వెనుకబడ్డాడు. మ్యాచ్‌లో ఒకానొక సమయంలో అతను చాలా వెనుకబడి ఉండటంతో మ్యాచ్ మూడో గేమ్‌కు వెళుతుందని అనిపించింది. లక్ష్య 16-20తో వెనుకబడి ఉన్నాడు. కానీ భారత షట్లర్ మళ్లీ తన మ్యాజిక్ ప్రదర్శించి 22-20తో మ్యాచ్‌ను గెలుచుకున్నాడు.

ఇవి కూడా చదవండి

నిరీక్షణ ముగిసింది..

అతని అద్భుతమైన విజయం తర్వాత, లక్ష్య సేన్ కోర్టులో పడుకుని, తన ఆనందాన్ని వ్యక్తపరిచాడు. అతని ముఖ కవళికలు, హావభావాలను బట్టి అతని ఆనందాన్ని అంచనా వేయవచ్చు. మ్యాచ్ గెలిచిన తర్వాత, లక్ష్య సేన్ ఓ ట్వీట్ కూడా చేశాడు.. నిరీక్షణ ముగిసిందంటూ ట్వీట్ చేశాడు.

అభినందించిన అనురాగ్ ఠాకూర్..

కెనడా ఓపెన్‌లో ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్‌పై లక్ష్య సేన్ సాధించిన విజయాన్ని భారత క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా ప్రశంసించారు. ముఖ్యంగా రెండవ గేమ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ఆ పునరాగమనాన్ని అద్భుతంగా అభివర్ణించాడు.

కెనడా ఓపెన్‌కు ముందు లక్ష్య సేన్ గతేడాది ఇండియా ఓపెన్‌ని గెలుచుకున్నాడు. ఇది అతనికి తొలి సూపర్ 500 టైటిల్ కావడం విశేషం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..