Japan Olympics: జపాన్ ఒలింపిక్స్ జరిగేది అనుమానమే..క్రీడలకు వ్యతిరేకంగా మెజార్టీ ప్రజలు..ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటుందో?

|

May 10, 2021 | 8:15 PM

Japan Olympics: గ‌తేడాది జ‌పాన్ వేదిక‌గా జ‌ర‌గాల్సిన ఒలింపిక్స్ క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డ్డాయి. ప‌రిస్థితులు చక్కబడ్డ త‌ర్వాత క్రీడ‌ల‌ను ప్రారంభిస్తామ‌ని నిర్వాహ‌కులు తెలిపారు.

Japan Olympics: జపాన్ ఒలింపిక్స్ జరిగేది అనుమానమే..క్రీడలకు వ్యతిరేకంగా మెజార్టీ ప్రజలు..ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటుందో?
Tokyo Olympics
Follow us on

Japan Olympics: గ‌తేడాది జ‌పాన్ వేదిక‌గా జ‌ర‌గాల్సిన ఒలింపిక్స్ క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డ్డాయి. ప‌రిస్థితులు చక్కబడ్డ త‌ర్వాత క్రీడ‌ల‌ను ప్రారంభిస్తామ‌ని నిర్వాహ‌కులు తెలిపారు. ఇందులో భాగంగానే ఈ ఏడాది జూన్‌లో క్రీడ‌ల‌ను నిర్వహించనున్నట్టు ప్రకటించారు. అయితే ఈ ఏడాది కూడా క‌రోనా విజృంభిస్తూనే ఉంది. జ‌పాన్‌లో కూడా క‌రోనా వైరస్ ప్రభావం కొనసాగుతూనే ఉంది. కేసుల సంఖ్య విప‌రీతంగా పెరుగుతుండడంతో అక్కడి ప్రభుత్వం ఇప్పటికే అత్యవసర పరిస్థితి విధించింది. ఈ నేపధ్యంలో ఈసారి ఒలింపిక్ క్రీడలు నిర్వహించాలా వాయిదా వేయాలా అనే అంశంపై అక్కడి స్థానిక మీడియా సర్వే నిర్వహించాయి. ఈ సర్వేల్లో 60 శాతం ప్రజలు ఒలింపిక్ క్రీడలను ఈ సంవత్సరం వాయిదా వేయాలని కోరుకుంటున్నట్టు తేలింది. 30 శాతం పైగా నిర్వహణకు మొగ్గు చూపారు. కానీ ఒలింపిక్ అభిమానులు మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ అనుమతించకూడదని చెప్పారు.

కరోనా కారణంగా ప్రస్తుతం జపాన్‌లోని నగరాలు, పట్టణాల్లో కొవిడ్‌ అత్యయిక పరిస్థితిని పొడిగించారు. అయితే, క్రీడల్ని కచ్చితంగా నిర్వహిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. స్వదేశీ అభిమానులను అనుమతించే విషయంపై మాత్రం ఆలోచన చేస్తున్నట్టు తెలిపింది.

మే 7 నుంచి 9 వరకు యోమియురి షింబున్‌ డైలీ ఒలింపిక్ క్రీడలు (Japan Olympics) జరపాలా వద్దా అనే అశంపై సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో 59% మంది క్రీడలను రద్దు లేదా వాయిదా వేయాలని ఓటేశారు. 39% మంది మాత్రం అందుకు వ్యతిరేకించారు. వాయిదా సరైన నిర్ణయం కాదన్నారు. అందులో 23% మంది మాత్రం అభిమానులు లేకుండా ఒలింపిక్స్‌ నిర్వహించాలని అన్నారు. టీబీఎస్‌ న్యూస్‌ నిర్వహించిన మరో పోల్‌లోనూ 65% వాయిదా లేదా రద్దుకే మొగ్గు చూపారు. ఏప్రిల్‌లోనూ క్యోడో న్యూస్‌ నిర్వహించిన సర్వేలో 73% మంది ప్రజలు వాయిదాకే ఓటేశారు. ఈ పరిస్థితుల్లో ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా జపాన్ ప్రభుత్వం ఒలింపిక్స్ నిర్వహణకు మొగ్గు చూపుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. దీనిపై ఇప్పటివరకూ ప్రభుత్వ వర్గాలు స్పందించలేదు.

Also Read: Gomathi Marimuthu: భారత మిడిల్ డిస్టెన్స్ రన్నర్ గోమతి మారిముత్తుకు షాక్… నాలుగేళ్ల నిషేధాన్ని ఎత్తివేసేందుకు సీఎఎస్ నిరాకరణ

ఢిల్లీ స్టేడియం వద్ద ఘర్షణ, రెజ్లర్ మృతి, ఒలంపిక్ మెడలిస్ట్ సుశీల్ కుమార్ పై ‘అనుమానపు నీలినీడలు’