భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నిర్వహిస్తున్న బిలీవ్ ఇన్ స్పోర్ట్స్ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా సింధు ఎంపికైంది. ఈ విషయాన్ని ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య తెలిపింది. సింధుతో పాటు కెనడాకు చెందిన మిచెల్లీ లి కూడా ఎంపికైంది. పోటీల్లో జరిగే అవకతవకలపై అవగాహన కల్పించేందుకు 2018లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వాస్తవానికి పీవీ సింధు ఇప్పటికే బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ఇయామ్ బ్యాడ్మింటన్ క్యాంపెయిన్‌కి గ్లోబర్ అంబాసిడర్‌గా ఉంది. ఈ మేరకు గత ఏడాది ఏప్రిల్ నుంచి పీవీ సింధు తన స్ఫూర్తివంతమైన మాటలతో యువ షట్లర్లలో ఉత్సాహం నింపుతోంది. దీంతో తాజాగా ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ మరో బాధ్యతని కూడా సింధుకే అప్పగించింది.
ఐఓసీ తనను అంబాసిడర్‌గా ఎంపిక చేయడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు సింధు. గేమ్‌లో ఛీటింగ్ లేదా పోటీలో అవకతవకలపై పోరాటంలో తన సహచర అథ్లెట్స్‌కి తాను అండగా నిలబడతానని వెల్లడించింది. సోషల్ మీడియా, వెబినార్ల ద్వారా యువ అథ్లెట్స్‌కి పీవీ సింధు అవగాహన కార్యక్రమాలు నిర్వహింబోతుంది.
Also Read: ఐపీఎల్ పై కరోనా కాటు.. నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించిన బీసీసీఐ