Boxer Vijender Singh Returns: బౌట్‌లో బొమ్మ చూపిస్తా.. ఎత్తుగా ఉంటే సరిపోదు…బలం.. వ్యూహం కావాలంటున్న విజేందర్ సింగ్

భారత్ బాక్సర్ విజేందర్ సింగ్ రింగులోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మరో సారి తన సత్తా చాటేందకు సిద్ధమవుతున్నాడు. పవర్ పంచులతో..

Boxer Vijender Singh Returns: బౌట్‌లో బొమ్మ చూపిస్తా.. ఎత్తుగా ఉంటే సరిపోదు...బలం.. వ్యూహం కావాలంటున్న విజేందర్ సింగ్
Indian Professional Boxer V

Updated on: Mar 19, 2021 | 2:33 PM

Boxer Vijender: భారత్ బాక్సర్ విజేందర్ సింగ్ రింగులోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మరో సారి తన సత్తా చాటేందకు సిద్ధమవుతున్నాడు. పవర్ పంచులతో ప్రత్యర్ధులను చుక్కులుచూపించేందుకు రెడీ అవుతున్నాడు. శుక్రవారం జరుగనున్న పోటీలో విజేతగా నిలచేందుకు సై అంటున్నాడు. రష్యా బాక్సర్ ఆర్టిష్ లాప్సన్​తో  బౌట్​లో తలపడబోతున్నాడు. ఈ బౌట్ ఓడ మీద జరగబోతుండటంతో ప్రత్యేకంగా నిలవనుంది.

ప్రొఫెషనల్ బాక్సింగ్​లో అజేయంగా దూసుకెళ్తోన్న భారత అగ్రశ్రేణి బాక్సర్ విజేందర్ సింగ్ మరో ఆసక్తికర ఫైట్ సిద్ధమవుతున్నాడు. ఇప్పటివరకూ తన కెరీర్లో ఓటమన్నదే తెలియని విజేందర్.. శుక్రవారం రష్యా పొడగరి బాక్సర్ ఆర్టిష్ లాప్పన్​‌ను చిత్తు చేసేందుకు ఫిక్స్ అయ్యాడు. ఈ బౌట్ ఓడ మీద జరగబోతుండటంతో అందరితో ఆసక్తి నెలకొంది. అరేబియా సముద్ర జలాల మీద మెజెస్టిక్ ప్రైడ్ క్యాసినో నౌకపై భాగంలో జరిగే ఈ పోరులో బాక్సర్లు విజయం కోసం పోరాడనున్నారు.

ప్రొఫెషనల్ కెరీర్ బౌట్ల రికార్డు 12-0గా… ఇందులో 8 నాకౌట్లు ఉన్నాయి. అయితే  35 ఏళ్ల విజేందర్ 2019 నవంబర్ తర్వాత తొలిసారి రింగ్​లో అరంగేట్రం చేశాడు. 26 ఏళ్ల ప్రత్యర్థి నుంచి అతనికి గట్టిపోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. 6.4 అడుగుల పొడవున్న లాప్సన్ ఇప్పటివరకు ఆరు బౌట్లలో నాలుగింట్లో గెలిచాడు. ఒక దాంట్లో మాత్రమే ఓడిపోయిన రికార్డ్ ఉంది. ఇందులో  మరోదాన్ని డ్రా చేసుకున్నాడు.

ఈ రోజు జరగనున్న బౌట్‌ ప్లాన్‌ను విజేందర్ సింగ్ రివిల్ చేశాడు. లాప్సన్ పొడుగ్గా ఉంటాడు. అతనితో బౌట్​ను నెమ్మదిగా ఆరంభిస్తానని అన్నాడు. ఏదేమైనా అతణ్ని ఓడిస్తాననే నమ్మకంతో ఉన్నట్లుగా ధీమా వ్యక్తం చేశాడు. బాక్సింగ్​లో ఎత్తుగా ఉంటే సరిపోదు… బలం.. వ్యూహం కావాలని చెప్పుకొచ్చాడు. నా అనుభవంతో పోలిస్తే అతనో పిల్లాడు అని తెలిపాడు. ఈ బౌట్ తర్వాత కూడా నా అజేయ రికార్డు కొనసాగుతుందని పూర్తి స్థాయి జోష్‌లో కనిపించాడు విజేందర్ సింగ్. ప్రత్యర్థి ఎంత కఠినంగా ఉంటే పోరు అంత సరదాగా ఉంటుందని విజేందర్ పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి: ఎటు చూసినా కట్టలకు కట్టల నోట్లు.. గుట్టలకు గుట్టల మనీ.. కమల్‌ హాసన్ పార్టీ ట్రెజరర్ ఇంట్లో దొరికిన డబ్బు..

ఇది కూడా ఔటేనా..! కాదే..! అంపైర్ నిర్ణయం సెటైర్లు..! కళ్లకు గంతలు కట్టుకున్నారా అంటూ సెహ్వాగ్ ట్వీట్..