Tokyo Olympics: నాన్-బ్రాండెడ్ కిట్ తో టోక్యో ఒలింపిక్స్ బరిలోకి దిగనున్న భారత ఆటగాళ్ళు!

|

Jun 09, 2021 | 6:33 PM

Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్ కు నాన్-బ్రాండెడ్ కిట్ తో భారత ఆటగాళ్ళు బరిలోకి దిగనున్నారు. చైనాకు చెందిన లి నింగ్ కిట్‌ను తొలగించాలని భారత ఒలింపిక్ అసోసియేషన్ నిర్ణయించింది.

Tokyo Olympics: నాన్-బ్రాండెడ్ కిట్ తో టోక్యో ఒలింపిక్స్ బరిలోకి దిగనున్న భారత ఆటగాళ్ళు!
Tokyo Olympics
Follow us on

Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్ కు నాన్-బ్రాండెడ్ కిట్ తో భారత ఆటగాళ్ళు బరిలోకి దిగనున్నారు. చైనాకు చెందిన లి నింగ్ కిట్‌ను తొలగించాలని భారత ఒలింపిక్ అసోసియేషన్ నిర్ణయించింది. ప్రస్తుతం మరే కంపెనీకీ దీనిని ఇవ్వలేదు. దీంతో ఇప్పటివరకూ ఉన్న సమాచారం ప్రకారం భారత ఆటగాళ్ళు నాన్-బ్రాండెడ్ కిట్ ఉపయోగిస్తారు. జూలై 23 నుండి జరగనున్న ఒలింపిక్ క్రీడల కోసం భారత ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ) ఇటీవల లి నింగ్ కిట్‌ను ఆమోదించింది. అయితే, ఇటీవల చైనాతో భారత్‌కు ఉన్న సంబంధాల దృష్ట్యా ఐఓఏ యొక్క ఈ నిర్ణయం విమర్శలను ఎదుర్కుంది. దీంతో చైనా కంపెనీని వదిలివేయాలని క్రీడా మంత్రిత్వ శాఖ ఐఓఏకు సూచించింది. అభిమానులు, దేశవాసుల మనోభావాలను గౌరవిస్తూ, టోక్యో ఒలింపిక్ క్రీడల్లో చైనా కంపెనీ కిట్ ధరించకూడదని ఐఓఏ నిర్ణయించిందని ఐఓఏ అధ్యక్షులు నరేంద్ర బాత్రా, రాజీవ్ మెహతా ఒక ప్రకటనలో తెలిపారు. నాన్-బ్రాండెడ్ కిట్లు ధరించి ఆటగాళ్ళు ఒలింపిక్స్‌కు వెళతారని వారు చెప్పారు.

ఆటగాళ్ళు శిక్షణపై దృష్టి పెట్టాలి

బాత్రా కిట్ యొక్క బ్రాండ్ గురించి ఆటగాళ్ళు గందరగోళం పడకూడదన్నారు. వారు వారి సన్నాహాలపై దృష్టి పెట్టాలి. గత సంవత్సరం, కరోనా కారణంగా, ఆటగాళ్ల శిక్షణ కూడా ప్రభావితమైంది. ఆటగాళ్ళు సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. వీటన్నిటితో ఆటగాళ్ళ దృష్టిని మరల్చకూదద్నై ఆయన అన్నారు. వారు తమ ఆటపై పూర్తిస్థాయిలో మనసు పెట్టాలని కోరుకుంటున్నామని బాత్రా చెప్పారు.

టీకా గురించి బాత్రా మాట్లాడుతూ.. ఫైనల్‌కు చేరుకున్న తర్వాత కూడా ఆటగాళ్ళకు పాజిటివ్ వచ్చే అవకాశం లేకపోలేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా రాదనీ చెప్పడానికి ఏమీ అవకాశం లేదని పరిస్థితులు సూచిస్తున్నాయి. అటువంటి పరిస్థితిలో, మా అథ్లెట్లకు కరోనాకు టీకాలు వేయడం అవసరం. అందుకే మేము టీకాలు వేసుకోమని అథ్లెట్లను కోరాము. అయితే, దీని కోసం మేము ఏ అథ్లెట్‌పై ఒత్తిడి తీసుకురాలేదు. ఇప్పటివరకు 120 మంది అథ్లెట్లు, 27 పారా అథ్లెట్లు టీకా మొదటి మోతాదును అందుకున్నారని బాత్రా చెప్పారు. అదే సమయంలో, 58 మంది అథ్లెట్లు మరియు 4 పారా అథ్లెట్లు టీకా రెండవ మోతాదును పొందారు. 114 మంది కోచ్‌లు, సహాయక సిబ్బంది కూడా టీకా మొదటి మోతాదును తీసుకున్నారు, 37 మంది రెండవ మోతాదును పొందారు.

Also Read: Tokyo Olympics: కోచ్‌లు, ఫిజియోల సంఖ్యను పెంచండి …ఇండియన్​ ఒలింపిక్​ అసోసియేషన్​కు లేఖ

ICC Award: ప్లేయర్ ఆఫ్ ది మంత్ రేసులో ఉన్నది వీరే.. మన హీరోలు ఎక్కడా..!