Airthings Masters: ప్రపంచ ఛాంపియన్‌కు షాకిచ్చిన 16 ఏళ్ల భారత గ్రాండ్‌మాస్టర్.. 3 నెలల్లో రెండోసారి..

|

May 21, 2022 | 3:06 PM

R Praggnanandhaa vs Magnus Carlsen: భారత దిగ్గజ చెస్ ఆటగాడు ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్‌ను ఓడించి ఛాంపియన్‌గా నిలిచిన కార్లెసన్‌కు ఈ కుర్రాడే రెండుసార్లు పరాజయాన్ని పరిచయం చేశాడు.

Airthings Masters: ప్రపంచ ఛాంపియన్‌కు షాకిచ్చిన 16 ఏళ్ల భారత గ్రాండ్‌మాస్టర్.. 3 నెలల్లో రెండోసారి..
R Praggnanandhaa
Follow us on

చెస్(Chess) ప్రపంచంలో అతనో ఛాంపియన్.. కానీ, అతనికి కేవలం మూడు నెలల్లోనే రెండు సార్లు చుక్కలు చూపించాడో 16 ఏళ్ల కుర్రాడు. చెన్నైకి చెందిన ఈ కుర్రాడు చెస్ ఆటలో తనదైన శైలిలో సత్తా చాటుతూ, ప్రపంచ దిగ్గజాలకు వరుస షాకిలుస్తుండడంతో, అతనిపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. మాములుగా టీనేజ్ అబ్బాయిలు ఇల్లు, పాఠశాల లేదా కళాశాలలో ఉంటారు. కానీ, అదే వయస్సులో చెస్ ప్లేయర్ రాంబాబు ప్రజ్ఞానంద్(R Praggnanandhaa) ప్రపంచ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్‌సెన్‌(Magnus Carlsen)ను ఓడించి, తన పేరును ప్రపంచానికి పరిచయం చేశాడు. భారత దిగ్గజ చెస్ ఆటగాడు ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్‌ను ఓడించి ఛాంపియన్‌గా నిలిచిన కార్లెసన్‌కు ఈ కుర్రాడే రెండుసార్లు పరాజయాన్ని పరిచయం చేశాడు.

Also Read: Watch Video: ఈ విజయం అన్‌స్టాపబుల్.. తెలంగాణ బిడ్డను పొగడ్తలతో ముంచెత్తిన ఆనంద్ మహీంద్రా..

16 ఏళ్ల రాంబాబు ప్రజ్ఞానంద్ చెస్‌బాల్ మాస్టర్స్ ఐదో రౌండ్‌లో ప్రపంచ ఛాంపియన్ కార్ల్‌సెన్‌ను ఓడించాడు. కార్లెసన్‌పై భారత గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద్ రమేష్‌ప్రభుకి ఇది రెండో విజయం. ఇంతకుముందు ఈ యువ ఆటగాడు ఫిబ్రవరిలో జరిగిన ఎయిర్‌థింగ్స్ మాస్టర్స్‌లో ప్రపంచ ఛాంపియన్ కార్ల్‌సెన్‌ను ఓడించాడు.

ఒక్క తప్పిదంతో ఓడిపోయిన ప్రపంచ ఛాంపియన్..

ఇవి కూడా చదవండి

చెస్‌బాల్ మాస్టర్స్ ఐదో రౌండ్‌లో నార్వే ఆటగాడు కార్ల్‌సెన్ పెద్ద తప్పిదం చేయగా, దాన్ని సద్వినియోగం చేసుకున్న భారత స్టార్ అతడిని ఓడించాడు. మొదట మ్యాచ్ డ్రా దిశగా సాగుతోంది. అయితే 40వ ఎత్తులో కార్ల్‌సెన్ తన నల్ల గుర్రాన్ని తప్పుదారి పట్టించాడు. ఈ చర్య తర్వాత, భారత ఆటగాడు అతనికి తిరిగి కోలుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. అకస్మాత్తుగా అతను ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. ఈ విజయం తర్వాత భారత ఆటగాడు ‘నేను ఇలా గెలవడం ఇష్టం లేదు’ అని చెప్పి, తన ఆటపై ఉన్న ప్రేమను చూపించాడు.

ఈ విజయంతో ఆన్‌లైన్ ర్యాపిడ్ చెస్ టోర్నీలో నాకౌట్‌కు చేరుకోవాలన్న ప్రజ్ఞానానంద్ ఆశలు అలాగే ఉన్నాయి. 150 వేల అమెరికన్ డాలర్ల (రూ. 1.16 కోట్లు) ప్రైజ్ మనీతో జరుగుతున్న ఈ టోర్నీలో ప్రజ్ఞానానంద్‌కు ప్రస్తుతం 12 పాయింట్లు ఉన్నాయి. రెండో రోజు తర్వాత, భారత స్టార్ స్టార్ ప్రజ్ఞానంద్ 12 పాయింట్లతో, 2022 ప్రపంచ ఛాంపియన్ కార్ల్‌సెన్ రెండో స్థానంలో నిలిచాడు. ఈ టోర్నీలో చైనాకు చెందిన వీ యి మొదటి స్థానంలో ఉన్నాడు. 16 మంది ఆటగాళ్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడైన గ్రాండ్‌మాస్టర్ అభిమన్యు మిశ్రా కూడా భాగమయ్యాడు.

Also Read: MS Dhoni: క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. కీలక ప్రకటన చేసిన మిస్టర్ కూల్.. వచ్చే సీజన్‌లోనూ..

FIFA 2022: ఫిఫా 2022 ప్రపంచ కప్‌కు సిద్ధమవుతున్న ఖతార్.. తగ్గేదే లేదంటూ..