Indian Football Team: దేశంలో కరోనా మహమ్మారి సేకండ్ వేవ్ రూపంలో మరింత విజృంభిస్తోంది. వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టినప్పటికీ.. రోజువారీగా నమోదయ్యే కేసుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. చిన్న పిల్లలు మొదలు.. పెద్దల వరకు అందరిపై విరుచుకుపడుతోంది మాయదారి కరోనా. ఇక సెకండ్ వేవ్‌లో అయితే సామాన్యులు మొదలు.. ఎంతోమంది సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. టీమిండియా క్రికెటర్లతో ఇప్పటికే చాలా మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. తాజాగా ఫుట్ బాట్ టీమ్ సభ్యులు కూడా కరోనా బారిన పడ్డారు. ఇండియన్ మెన్స్ ఫుట్‌బాట్ టీమ్ మిడ్ ఫీల్డర్ అనిరుధ్ తాపా కు కరోనా వైరస్ సోకింది. తాజాగా అనిరుధ్‌కు కోవిడ్ పరీక్షలు నిర్వహించిన వైద్యులు పాజిటివ్ అని నిర్ధారించారు. 23 ఏళ్ల అనిరుధ్ ఇప్పుడు దోహాలోని ఓ హోటల్ రూమ్‌లో క్వారంటైన్‌లో ఉన్నాడు.
కాగా, ఖతార్‌లోని దోహాలో జరుగుతున్న జాయింట్ వరల్డ్ కప్, ఆసియన్ కప్ క్వాలిఫయర్స్ టోర్నీలో పాల్గొనేందుకు ఇండియన్ మెన్స్ ఫుట్‌బాల్ టీమ్ దోహాకు వెళ్లింది. అయితే మ్యాచ్ ప్రారంభం అయ్యే ముందు రోజు టీమ్ సభ్యులకు కరోనా టెస్ట్‌లు నిర్వహించగా.. అనిరుధ్ తపాకు పాజిటివ్ అని తేలింది. మిగతా టీమ్ సభ్యులందరికీ నెగటీవ్ వచ్చింది. కాగా, దోహాలో జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ఆసియన్ ఛాంపియన్స్ ఖతార్ జట్టు చేతిలో ఇండియా 0-1 తో ఓడిపోయింది. అయితే, ఇండియన్ ఫుట్‌బాల్ టీమ్ ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ గెలవకపోయినప్పటికీ గ్రూప్-ఇ లో నాలుగవ స్థానంలో ఉంది.
Also read:
ఢిల్లీ ఆసుపత్రిలో జారీ అయిన వివాదాస్పద సర్క్యులర్ ఉపసంహరణ…..’మలయాళీ’ వివాదానికి తెర