Tokyo Olympics: జులై 23 నుంచి ఆగస్టు 8 వరకు టోక్యో ఒలింపిక్స్ జరగనున్నసంగతి తెలిసిందే. ఈమేరకు ఒలింపిక్స్ లో పోటీ చేసే జాతీయ మహిళా హాకీ జట్టుకు కెప్టెన్‌గా స్ట్రైకర్ రాణి రాంపాల్‌ను హాకీ ఇండియా (హెచ్‌ఐ) ప్రకటించింది. అలాగే గోల్‌కీపర్ సవిత, దీప్ గ్రేస్ ఎక్కా లు వైస్ కెప్టెన్‌లుగా ఎనౌన్స్ చేశారు. గత వారం హాకీ టీంలో ఆడబోయే 16 మంది సభ్యులను ప్రకటించిన సంగతి తెలిసిందే. టీం సభ్యులను ప్రకటించినప్పుడు కెప్టెన్ పేరును మాత్రం ప్రకటించలేదు. ఈమేరకు నేడు కెప్టెన్‌తో పాటు వైస్ కెప్టెన్‌లను హెచ్‌ఐ ప్రకటించింది. రాణి రాంపాల్ మాట్లాడుతూ, “ఒలింపిక్ క్రీడలలో భారత జట్టుకు నాయకత్వం వహించడం ఎంతో గౌరవంగా ఫీలవుతున్నాను. గతేడాది సీనియర్ ఆటగాళ్ళతో ఆడడం నాకు బాగా కలిసి వచ్చిందని” ఆమె పేర్కొంది.
రాణి కెప్టెన్సీలో, 2017 లో ఆసియా కప్, 2018 లో ఆసియా క్రీడలలో రజత పతకం, 2018 ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో రజతం, అలాగే FIH సిరీస్ ఫైనల్ గెలిచింది. రాణి నాయకత్వంలో తొలిసారి లండన్‌లో జరిగిన 2018 ఎఫ్‌ఐహెచ్ ఉమెన్స్ వరల్డ్ కప్‌లో భారత్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. రాణి రాంపాల్ భారత్ తరఫున 241 మ్యాచ్‌లు ఆడి 118 గోల్స్ చేసింది.
It’s a great honour for me to lead our team during #Tokyo2020 Thank you @TheHockeyIndia and coaches for this responsibility. All the members of our team are working hard and we will give our best at Tokyo2020. Thanks to my family, friends and fans for all their support. https://t.co/RyMsBrWTGG
— Rani Rampal (@imranirampal) June 22, 2021
Also Read:
Euro Cup 2020: చరిత్ర సృష్టించేందుకు మరో గోల్ దూరంలో రొనాల్డో; 109 గోల్స్‌తో ప్రపంచ రికార్డు సమం
Tokyo Olympics: ‘ఎంజాయ్ చేయాలంటే కుదరదు.. గమ్మున ఉండాల్సిందే’: జపాన్ ప్రభుత్వం!
Indian Cricket Team: ఫైనల్స్‌లో తడబడుతోన్న టీమిండియా; ఏడేళ్లలో 6 ఐసీసీ ట్రోఫీలు మిస్!