Senior Athletics Championship: అద్భుతం చేసిన 29 ఏళ్ల భారత అథ్లెట్.. 22 ఏళ్లనాటి రికార్డులకు బీటలు..

AFI నేషనల్ ఫెడరేషన్ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత డిస్కస్ త్రో ప్లేయర్ కృపాల్ సింగ్ మంగళవారం 22 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు.

Senior Athletics Championship: అద్భుతం చేసిన 29 ఏళ్ల భారత అథ్లెట్.. 22 ఏళ్లనాటి రికార్డులకు బీటలు..
Kripla Singh

Updated on: Apr 05, 2022 | 9:54 PM

AFI నేషనల్ ఫెడరేషన్ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌(AFI National Federation Senior Athletics Championship)లో భారత డిస్కస్ త్రో(Discuss Throw) ప్లేయర్ కృపాల్ సింగ్(Kripal Singh)  మంగళవారం 22 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. 61.83మీటర్ల దూరం త్రో విసిరి ఈ రికార్డును బద్దలు కొట్టాడు. 29 ఏళ్ల కృపాల్ సీఎస్ మహమ్మద్ కోయా స్టేడియంలో నిలకడగా రాణించి మంచి త్రోలు విసిరాడు. అతను తన మునుపటి బెస్ట్ కంటే మెరుగ్గా త్రో చేశాడు. అంతకుముందు, అతను ఆరేళ్ల క్రితం సాధించిన రికార్డ్ 59.74 మీ. గా నిలిచింది.

అతని ప్రయత్నాలలో నాలుగు 60కి పైగా దూరం వెళ్లాయి. వాటిలో రెండు 61 మీటర్లు దాటి ఉన్నాయి. అతని మొదటి, చివరి త్రో 59 మీటర్లు వెళ్లింది. అతని అత్యుత్తమ ప్రదర్శన 61.83 మీటర్లుగా నిలిచింది. అయితే, 62 మార్కును దాటి ఉంటే, అతను 62మీటర్లు దాటిన మూడవ భారతీయ అథ్లెట్‌గా నిలిచేవాడు. పాత రికార్డు 59.55 మీటర్లు అనిల్ కుమార్ పేరిట ఉంది.