Abhinav Mulagada: యువతపై తమ దృష్టిని కొనసాగిస్తూ, హైదరాబాద్ ఎఫ్‌సి రిజర్వ్ టీమ్ కోసం నగరంలో జన్మించిన గోల్ కీపర్ అభినవ్ ములగడను ఎంపిక చేసినట్లు క్లబ్ శనివారం ప్రకటించింది. ప్రతిభావంతులైన స్థానిక యువకుల అభివృద్ధికి వేదికను అందించే లక్ష్యంతో ఏప్రిల్‌లో నిర్వహించిన స్థానిక ట్రయల్స్‌లో అభినవ్ ప్రతిభను గుర్తించిన హెచ్‌ఎఫ్‌సీ, 16 ఏళ్ల యువకుడితో దీర్ఘకాలిక ఒప్పందం చేసుకుంది.
“అందరి యువకుల్లాగే, నేను నా స్వస్థలం నుంచి హైదరాబాద్ ఎఫ్‌సీ వంటి పెద్ద క్లబ్ కోసం ఆడాలని ఎప్పుడూ కోరుకునేవాడిని. పిచ్‌పై డెలివరీ చేయడానికి నేను ఆతృతగా ఉన్నాను. ఈ రంగులను ధరించడం గౌరవంగా ఉంది” అని ఫార్మాలిటీస్ పూర్తి చేసిన తర్వాత అభినవ్ తెలిపాడు.
హెచ్‌ఎఫ్‌సీతో ప్రొఫెషనల్ నిబంధనలపై సంతకం చేసిన మొట్టమొదటి హైదరాబాదీ ఆటగాడిగా మారిన ఈ యువకుడు, 2014 లో చిన్న వయస్సులోనే సెన్‌రాబ్ ఫుట్‌బాల్ క్లబ్ (లండన్)తో ప్రారంభించి సండే లీగ్ ఫుట్‌బాల్‌లో పాల్గొన్నాడు. అతను లండన్‌లోని లేటన్ ఓరియంట్ అకాడమీలో కూడా శిక్షణ తీసుకున్నాడు. దానికి ముందు చెల్సియా అకాడమీ యూ15 ల వద్ద ఆరు నెలలు 2016, 2017 లో ప్రముఖ ఫుట్ బాల్ క్రీడాకారుడు వైవెస్ మా-కలాంబే వద్ద కోభామ్ ట్రైనింగ్ గ్రౌండ్‌లో శిక్షణ పొందారు.
? పక్కా లోకల్!
Bachupally-resident Abhinav Mulagada signs long-term deal with Hyderabad FC.
The Goalkeeper becomes first local lad to sign professionally for the club. ?#WelcomeAbhinav #మనహైదరాబాద్ #HyderabadFC ?? pic.twitter.com/qrgH9Y4T9w
— Hyderabad FC (@HydFCOfficial) September 11, 2021
IND vs ENG: కేఎల్ రాహుల్- రిషబ్ పంత్‌లు సెంచరీలు.. అయినా భారత్ ఘోర పరాజయం.. ఎప్పుడో తెలుసా?