National Open Masters Athletics: 105 ఏళ్ల వయసులో సంచలనం సృష్టించిన బామ్మ.. 100 మీట్లర రేసులో గోల్డ్ మెడల్..

|

Jun 25, 2022 | 2:01 PM

National Open Masters Athletics Championships: అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన తొలి నేషనల్ ఓపెన్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో

National Open Masters Athletics: 105 ఏళ్ల వయసులో సంచలనం సృష్టించిన బామ్మ.. 100 మీట్లర రేసులో గోల్డ్ మెడల్..
Old Woman
Follow us on

National Open Masters Athletics Championships: అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన తొలి నేషనల్ ఓపెన్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 105 ఏళ్ల రాంబాయి సంచలనం సృష్టించింది. 100 మీటర్ల పరుగులో సరికొత్త రికార్డు నెలకొల్పింది. కేవలం 45.40 సెకన్లలో రేస్‌ను పూర్తి చేసి ఔరా అనిపించింది. నేషనల్ ఓపెన్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో రాంబాయి ఒక్కరే పాల్గొనడం మరో విశేషం. కాంపిటేషన్ లేకపోయినప్పటికీ.. ఒంటరిగానే 45.40 సెకన్లలో 100 మీటర్ల పరుగును పూర్తి చేసి స్వర్ణం గెలిచింది. ఇక ప్రపంచ మాస్టర్స్ మీట్‌లో పాల్గొన్న మన్ కౌర్(101) 74 సెకన్లలో 100 మీటర్ల రేస్‌ను పూర్తి చేసింది. అయితే, మన్ కౌర్ రికార్డ్‌ను రాంబాయి బ్రేక్ చేశారు. 100 మీటర్ల పరుగు పందెంలో సరికొత్త రికార్డ్ నెలకొల్పారు.

హర్యానాకు చెందిన రాంబాయి(105).. అంతకు ముందు అనేక రేసుల్లో పాల్గొంది. ఒక పోటీలో 4 స్వర్ణాలు గెలువగా.. మహారాష్ట్రలో నిర్వహించిన రేస్‌లో 5 బంగారు పతకాలు గెలుచుకుంది. రాంబాయి రోజూ నెయ్యి, పెరుగు ఎక్కువగా తీసుకుంటారని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె రోజుకు రెండుసార్లు స్వచ్ఛమైన పాలు తాగుతుందని, నెయ్యి కూడా ఆహారం తీసుకుంటుందని తెలిపారు. అన్నం ఎక్కువగా తనదని చెప్పారు.

కాగా, రాంబాయి తన అథ్లెటిక్ కెరీర్‌ను 2021లో ప్రారంభించింది. అంతకు ముందు సీనియర్ సిటిజన్స్ రేస్ కేటగిరీ ఉందని తమకు తెలియని రాంబాయి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇక ఈ విజయంపై రాంబాయి సంతోషం వ్యక్తం చేశారు. మళ్లీ రేసులో పాల్గొనాలని అనుకుంటున్నాను అంటూ తన ఉత్సుకతను వ్యక్తం చేశారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..