FIFA Awards: ఫిఫా బెస్ట్ ప్లేయర్ అవార్డ్‌ రేసులో 14 మంది.. లిస్టులో దిగ్గజ ప్లేయర్‌కు భారీ షాక్..

FIFA Best Player Award: లియోనెల్ మెస్సీ, కైలియన్ ఎంబాప్పే సహా 14 మంది ఆటగాళ్లు ఫిపా పురుషుల ఉత్తమ ఆటగాడు అవార్డుకు ఎంపికయ్యారు.

FIFA Awards: ఫిఫా బెస్ట్ ప్లేయర్ అవార్డ్‌ రేసులో 14 మంది..  లిస్టులో దిగ్గజ ప్లేయర్‌కు భారీ షాక్..
Argentina Football Team

Updated on: Jan 13, 2023 | 12:19 PM

ఫుట్‌బాల్ గవర్నింగ్ బాడీ (FIFA) వార్షిక ఫిఫా అవార్డులకు నామినీలను ప్రకటించింది. బెస్ట్ ప్లేయర్ నుంచి బెస్ట్ గోల్ కీపర్, కోచ్ వరకు నామినేషన్ జాబితా విడుదలైంది. మహిళా ఫుట్‌బాల్ క్రీడాకారులకు కూడా నామినేషన్లు వచ్చాయి. ఫిఫా అవార్డ్స్‌లో 14 మంది ఆటగాళ్లు కీలక అవార్డైన ‘బెస్ట్ ప్లేయర్’కి నామినేట్ అయ్యారు. వీరిలో లియోనెల్ మెస్సీ, కైలియన్ ఎంబాప్పే ఉన్నారు.

లియోనెల్ మెస్సీ ఫిఫా ప్రపంచ కప్ 2022 ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ గెలుచుకున్నాడు. అతనికి గోల్డెన్ బాల్ అవార్డు కూడా లభించింది. తన జట్టుకు ప్రపంచకప్ ట్రోఫీని అందజేయడంలో అతను కీలక పాత్ర పోషించాడు. అటువంటి పరిస్థితిలో, మెస్సీ ఫిఫా బెస్ట్ ప్లేయర్ అవార్డు రేసులో ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. అతను పీఎస్‌జీ సహచర ప్లేయర్ ఎంబాప్పే నుంచి అతిపెద్ద సవాలును ఎదుర్కొంటాడు. ఫిపా వరల్డ్ కప్ 2022లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా ఎంబాప్పే నిలిచాడు. అతనికి ‘గోల్డెన్ బూట్’ అవార్డు లభించింది.

ఇవి కూడా చదవండి

మెస్సీ, ఎంబాప్పే కాకుండా నేమార్, లూకా మోడ్రిచ్, రాబర్ట్ లెవాండోస్కీ, మహ్మద్ సలా వంటి మొత్తం 14 మంది ఆటగాళ్లు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. క్రిస్టియానో ​​రొనాల్డో ఈ జాబితాలో చేరలేదు.

ఫిఫా బెస్ట్ మెన్స్ ప్లేయర్ నామినీలు..

లియోనెల్ మెస్సీ, కైలియన్ ఎంబాప్పే, జూలియన్ అల్వారెజ్, జూడ్ బెల్లింగ్‌హామ్, కరీమ్ బెంజెమా, కెవిన్ డి బ్రూయిన్, అర్లింగ్ హాలాండ్, అష్రఫ్ హకీమి, రాబర్ట్ లెవాండోస్కీ, సాడియో మానే, లుకా మోడ్రిక్, నెయ్‌మార్, మొహమ్మద్ సలాహ్.

ఫిఫా ఉత్తమ పురుషుల గోల్ కీపర్ నామినీలు..

ఎమిలియానో ​​మార్టినెజ్, అలిసన్ బెకర్, థిబౌట్ కోర్టియస్, ఎడెర్సన్, యాసిన్ బౌను.

ఫిఫా ఉత్తమ పురుషుల జట్టు కోచ్‌లు..

లియోనెల్ స్కలోని, పెప్ గార్డియోలా, డిడియర్ డెస్చాంప్స్, కార్లో అంక్లోట్టి, వాలిద్ రెగ్రగుయ్.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..