FIFA World Cup 2026 : ఫుట్‌బాల్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. పైసా ఖర్చు లేకుండా ఫిఫా మ్యాచ్‌లు చూసేయండిలా!

FIFA World Cup 2026 : ఫిఫా వరల్డ్ కప్ 2026 మ్యాచ్‌లను భారతదేశంలో ఎలా చూడాలి ? జీ5, డీడీ స్పోర్ట్స్‌లో లైవ్ స్ట్రీమింగ్, ఉచితంగా మ్యాచ్‌లు చూసే మార్గాలు, 48 జట్లు, 104 మ్యాచ్‌ల పూర్తి వివరాలు తెలుసుకుందాం.

FIFA World Cup 2026  : ఫుట్‌బాల్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. పైసా ఖర్చు లేకుండా ఫిఫా మ్యాచ్‌లు చూసేయండిలా!
Fifa World Cup 2026

Updated on: Jun 12, 2026 | 3:38 PM

FIFA World Cup 2026 : ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఎంతగానో ఎదురుచూస్తున్న అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడా సంబరం ఫిఫా పురుషుల ఫుట్‌బాల్ ప్రపంచకప్ 2026 గ్రాండ్‌గా ప్రారంభమైంది. భారత కాలమానం ప్రకారం జూన్ 12వ తేదీ అర్ధరాత్రి 12:30 గంటల నుంచి ఈ మెగా టోర్నమెంట్ మ్యాచ్‌లు అధికారికంగా షురూ అయ్యాయి. ఈసారి ఫుట్‌బాల్ కప్ కోసం అగ్రదేశాలు హోరాహోరీగా తలపడనుండటంతో భారతీయ క్రీడాభిమానుల్లో కూడా ఫుట్‌బాల్ ఫీవర్ పీక్స్‌కు చేరింది. అయితే ఈ మ్యాచ్‌లను టీవీల్లో, మొబైల్స్‌లో ఎలా చూడాలి? ఉచితంగా చూసే మార్గాలు ఏంటి? అనే వివరాలు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి.

జీ5 యాప్‌లో అన్ని మ్యాచ్‌ల లైవ్ స్ట్రీమింగ్

ఈసారి ఫిఫా వరల్డ్ కప్ 2026 టోర్నీకి సంబంధించిన డిజిటల్, శాటిలైట్ బ్రాడ్‌కాస్టింగ్ హక్కులను భారతదేశంలో ప్రముఖ మీడియా దిగ్గజం జీ ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్ దక్కించుకుంది. ఇందుకోసం జీ సంస్థ ఏకంగా 60 మిలియన్ డాలర్ల (సుమారు రూ.500 కోట్లు) భారీ డీల్ కుదుర్చుకోవడం విశేషం. ఈ ఒప్పందం ప్రకారం టోర్నీలో జరగబోయే మొత్తం 104 మ్యాచ్‌లను వినియోగదారులు జీ5 అప్లికేషన్ ద్వారా లైవ్‌లో వీక్షించవచ్చు. ప్రభుత్వ ఉచిత ఛానల్ అయిన డీడీ స్పోర్ట్స్ లో కూడా కొన్ని ముఖ్యమైన మ్యాచ్‌లు మాత్రమే ప్రసారం కానున్నాయి.

పైసా ఖర్చు లేకుండా ఉచితంగా చూసే సీక్రెట్ ట్రిక్

సాధారణంగా జీ5 యాప్‌లో పూర్తి వరల్డ్ కప్ మ్యాచ్‌లను నాన్‌స్టాప్‌గా చూడాలంటే ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా ఈ 104 మ్యాచ్‌లను ఉచితంగా చూసే ఒక చక్కటి అవకాశం అందుబాటులో ఉంది. ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ తన కస్టమర్ల కోసం కొన్ని ప్రత్యేకమైన ఇంటర్నెట్, మొబైల్ రీఛార్జ్ ప్లాన్లను అందిస్తోంది. ఎయిర్ టెల్ ప్రీ పెయిట్ 598 (28 డేస్ వ్యాలిడిటీ), 1729 (84 డేస్ వ్యాలిడిటీ) ప్లాన్లో జీ 5 వస్తుంది. ఈ ప్లాన్లతో రీఛార్జ్ చేసుకుంటే వినియోగదారులకు ఉచితంగా Zee5 OTT సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. ఈ ప్లాన్లను ఉపయోగించుకుని ఫుట్‌బాల్ లవర్స్ ఉచితంగా ఫిఫా యాక్షన్‌ను లైవ్‌లో ఎంజాయ్ చేయవచ్చు. అలాగే జీ 5 799 యాన్యువల్ ప్లాన్ తీసుకుంటే అన్ని మ్యాచులు చూసేయవచ్చు. అదే నెలకు అయితే 266తో సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న మ్యాచులు ఎంజాయ్ చేయొచ్చు.

 

మూడు దేశాల సంయుక్త ఆతిథ్యం

ఈ 2026 ఫిఫా ప్రపంచకప్‌కు ఉత్తర అమెరికా ఖండంలోని మూడు ప్రముఖ దేశాలైన అమెరికా, మెక్సికో, కెనడాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. ఈసారి టోర్నీలో ఫిఫా కొన్ని చారిత్రాత్మక మార్పులు చేసింది. గతంలో కేవలం 32 జట్లు మాత్రమే పాల్గొనేవి, కానీ ఈసారి ఆ సంఖ్యను ఏకంగా 48కి పెంచారు. ఈ 48 జట్లను గ్రూప్‌నకు నాలుగు చొప్పున మొత్తం 12 గ్రూపులుగా విభజించారు. లీగ్ దశలో ప్రతి జట్టుకు మూడు మ్యాచ్‌లు ఆడే అవకాశం లభిస్తుంది.

నాకౌట్ రేసు, అంతర్జాతీయ ప్రసారాలు

లీగ్ మ్యాచ్‌లు ముగిసిన తర్వాత ప్రతి గ్రూప్ నుంచి టాప్-3 స్థానాల్లో నిలిచిన జట్లు నేరుగా నాకౌట్ దశకు అర్హత సాధిస్తాయి. ఆ తర్వాత జరిగే మ్యాచ్‌లలో గెలిచిన జట్లు తదుపరి రౌండ్లకు క్వాలిఫై అవుతూ ఫైనల్ రేసులో నిలుస్తాయి. భారతదేశంలో జీ నెట్‌వర్క్ ప్రసారాలు చేస్తుండగా.. అంతర్జాతీయంగా యూట్యూబ్ టీవీ, డైరెక్ట్ టీవీ, ఫుబో టీవీ వంటి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ ద్వారా ఈ మెగా ఈవెంట్‌ను లైవ్ టెలికాస్ట్ చేస్తున్నాయి.

 

మరిన్ని క్రికెట్ మ్యాచ్‌ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us