FIFA WC 2022 Prize Money: ఫిఫా విజేతకు ట్రోఫీతో పాటు దక్కనున్న ప్రైజ్ మనీ ఎంతంటే? తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

|

Dec 18, 2022 | 6:10 AM

ఫిఫా వరల్డ్ 2022 ముగింపు దిశగా సాగుతోంది. అర్జెంటీనా, ఫ్రాన్స్‌లు ప్రపంచ ఫైనల్స్‌కు చేరుకున్నాయి. ఈసారి ఫైనలిస్ట్, రన్నరప్‌కు ఎంత మొత్తం ఇవ్వనున్నారో తెలుసుకుందాం.

FIFA WC 2022 Prize Money: ఫిఫా విజేతకు ట్రోఫీతో పాటు దక్కనున్న ప్రైజ్ మనీ ఎంతంటే? తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
Fifa World Cup 2022
Follow us on

FIFA WC 2022 Prize Money: ఫిఫా వరల్డ్ కప్ 2022 చివరి దశకు చేరుకుంది. ఈ ఏడాది ప్రపంచకప్‌లో అర్జెంటీనా, డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఫ్రాన్స్‌ ఫైనల్‌కు చేరాయి. సెమీస్‌లో మొరాకోపై ఫ్రాన్స్, క్రొయేషియాపై అర్జెంటీనా విజయం సాధించాయి. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ డిసెంబర్ 18 ఆదివారం జరుగుతుంది. ఫైనల్‌లో విజేతగా నిలిచిన జట్టుకు, రన్నరప్‌గా నిలిచిన జట్టుకు ఎంత ప్రైజ్‌మనీ ఇస్తారో వెల్లడైంది. FIFAలో ఫైనలిస్ట్, రన్నర్-అప్ నుంచి ఒక జట్టుకు ఎంత ప్రైజ్ మనీ ఇవ్వనున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

విజేతకు 42 మిలియన్ డాలర్లు..

FIFA వరల్డ్ కప్ 22వ ఎడిషన్‌లో మొత్తం $440 మిలియన్ల ప్రైజ్ మనీ పంపిణీ చేయనున్నారు. ఈ మొత్తం మునుపటి సీజన్ కంటే 40 మిలియన్ డాలర్లు (సుమారు 331 కోట్లు) ఎక్కువ. ఈసారి, ట్రోఫీతో పాటు, FIFA విజేత జట్టుకు $ 42 మిలియన్లు (దాదాపు రూ.344 కోట్లు) ఇవ్వనున్నారు. అదే సమయంలో, రన్నరప్‌కు 30 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 245 కోట్లు) దక్కనున్నాయి.

మిగిలిన జట్లకు ఎంతంటే?

ఫైనలిస్ట్, రన్నరప్ కాకుండా, మూడవ నంబర్ జట్టుకు $27 మిలియన్లు (సుమారు రూ. 220 కోట్లు) ఇవ్వనున్నారు. మూడో స్థానం కోసం మొరాకో, క్రొయేషియా డిసెంబర్ 17న తలపడనున్నాయి. అదే సమయంలో, నాల్గవ నంబర్ జట్టుకు 25 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 204 కోట్లు) దక్కనున్నాయి.

ఇవి కూడా చదవండి

ఇది కాకుండా, 5 నుంచి 8 స్థానాల్లో ఉన్న జట్లకు 17 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 138 కోట్లు) ఇవ్వనున్నారు. ఆ తర్వాత, 9 నుంచి 16 నంబర్‌లో ఉన్న జట్లకు $ 13 మిలియన్లు (దాదాపు రూ. 106 కోట్లు) ఇవ్వనున్నారు. అదే సమయంలో, 17 నుంచి 32 స్థానాల్లో ఉన్న జట్లకు బహుమతిగా $ 9 మిలియన్లు (దాదాపు రూ.74 కోట్లు) ఇవ్వనున్నారు.

విశేషమేమిటంటే, 2018లో ఆడిన ప్రపంచకప్‌లో విజేత ఫ్రాన్స్‌కు 38 మిలియన్ డాలర్లు (సుమారు రూ.314 కోట్లు) అందించారు. మరోవైపు రన్నరప్‌గా నిలిచిన క్రొయేషియాకు 28 (దాదాపు రూ. 231 కోట్లు) మిలియన్ డాలర్లు అందించారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..